Bhagavanth Kesari సీనియర్ నటిని ముద్దు పెట్టుకొన్న బాలకృష్ణ! ఫోటో వైరల్!
భగవంత్ కేసరి మూవీ సక్సెస్‌ను నందమూరి బాలకృష్ణ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్‌లో చొరవ తీసుకొంటున్నారు. అవసరమైన మేరకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల బాబీ హోస్ట్‌గా జరిగిన ఇంటర్వూలో బాలకృష్ణతోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటి జయచిత్ర పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రమోషనల్‌లో జరిగిన విషయాల్లోకి వెళితే..
భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. సీనియర్ నటి జయచిత్ర కీలక పాత్రను పోషించారు. బాలకృష్ణకు తల్లిగా ఎమోషనల్ పాత్రను చేసి ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నారు. తన తల్లి పాత్రను పోషించిన జయచిత్రపై బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఫెర్ఫార్మెన్స్‌ను అభినందించారు.

భగవంత్ కేసరి సినిమాలో తనకు రోల్ ఇచ్చిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల నుంచి తెలుగులో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. అనిల్ రావిపూడి పాత్ర గురించి చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యాను. రెండు నిమిషాల పాత్ర ఉన్నా సరే.. నేను నటిస్తానని చెప్పాను. నేను పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. బాలకృష్ణతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది అని జయచిత్ర చెప్పారు.
దాంతో జయచిత్రపై నందమూరి బాలకృష్ణ తన అభిమానాన్ని కురిపించారు. ఆమెతో కలిసి ఉయ్యాలో ఉయ్యాలో పాటను పాడుతూ ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకొన్నారు. తన తలను ఆమె తలకు పెట్టి పాటను పాడుతూ తన్మయత్వం చెందారు. వెంటనే పక్కనే ఉన్న ఆమె చెంపపై ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకొన్నారు. వెంటనే ఆమె చేయి తీసి తన తలపై పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు. సీనియర్ నటి జయచిత్ర తనకు తల్లి లాంటి వ్యక్తి అని అన్నారు.

భగవంత్ కేసరి సినిమాలో జయచిత్ర నటించడం గొప్ప విషయం. మా ఇద్దరి మధ్య సన్నివేశాలకు తమన్ ఇచ్చిన పాట అద్బుతంగా ఉంది. ఈ పాట అందర్ని ఎమోషనల్‌కు గురిచేస్తున్నది. ఈ విషయంలో అనిల్ రావిపూడి, తమన్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











