twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ ఫొటో వైరల్.. మోక్షజ్ఞ ఇంకా అలానే.. సిద్ధం కానట్లే?

    |

    నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుసగా బాక్సాఫీసు రికార్డులతో తన స్థాయిని మరింతగా పెంచుకుంటున్నారు. అయితే ఆయన వారసుడు మోక్షజ్ఞ తేజ కోసం కూడా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక క్లారిటీ ఇచ్చిన బాలయ్య బాబు మళ్లీ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా వారి కుటుంబ సభ్యులతో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందులో మోక్షజ్ఞ తేజ లుక్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

    మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూపులు

    మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూపులు


    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎక్కువగా మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో సింహ సినిమా నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ మధ్యకాలంలో ఒకరిద్దరు దర్శకులతో కూడా బాలయ్య బాబు చర్చలు అయితే జరిపారు కానీ అవి ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

    ఆదిత్య 369 సీక్వెల్?

    ఆదిత్య 369 సీక్వెల్?

    అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గత రెండేళ్ల నుంచి అయితే తప్పకుండా తన వారసుడు ఎంట్రీ ఇస్తాడు అని చాలా నమ్మకంగా తెలియజేశారు. అది కూడా తన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఒక కథను కూడా రెడీ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టుకు ఆదిత్య అనే టైటిల్ కూడా అనుకుంటున్నాను అని అప్పట్లో వివరణ ఇచ్చారు. ఇక బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి.. ఇలా కొంతమంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

    ప్రయత్నాలు చేయని మోక్షజ్ఞ

    ప్రయత్నాలు చేయని మోక్షజ్ఞ

    అయితే నందమూరి వంశంలో చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో కి రావాలని అనుకున్న వారు మాత్రం రెండు పదుల వయసులో కి రాకముందే వారి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే మోక్షజ్ఞ తేజ మాత్రం మూడు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఎలాంటి ప్రయత్నాలు స్టార్ట్ చేయడం లేదు. ప్రస్తుతం అతని వయసు 27 సంవత్సరాలు.

    ఫ్యామిలీ ఫొటో వైరల్

    ఫ్యామిలీ ఫొటో వైరల్

    ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో బాలయ్య సతీమణి వసుంధర దేవి అలాగే పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి, కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ కూడా ఉన్నాడు. ఇక ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ సరికొత్త మీసంతో కనిపిస్తున్నాడు.

    అసలు మోక్షజ్ఞకు ఇష్టం ఉందా లేదా?

    అసలు మోక్షజ్ఞకు ఇష్టం ఉందా లేదా?

    అయితే మోక్షజ్ఞ ఇంకా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి మార్పు తీసుకు రాలేదని తెలుస్తోంది. అలాగే అతని ఫేస్ లుక్ కూడా నార్మల్ గానే ఉంది. కాబట్టి ఇంకా ఎంట్రీ విషయంలో మోక్షజ్ఞ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసలు అతనికి సినీ రంగంలో కొనసాగడం ఇష్టం లేదా అనే విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. బాలయ్య అయితే తప్పకుండా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడాని నమ్మకంగా చెప్పారు. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Nandamuri balakrishna latest family photo viral and Mokshagna Teja latest look
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X