'భగవంత్ కేసరి'లో శ్రీలీల క్యారెక్టర్ అదే.. బాలయ్య లీక్ చేశాడుగా!

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నందమూరి బాలకృష్ణ జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనే అఖండగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో తో.. బుల్లి తెరపై కూడా క్రేజ్ ను సొంతం చేసుకున్న బాలయ్య... ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు వీరసింహారెడ్డి మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా... అందరినీ ఆకట్టుకుంటోంది.

Nandamuri Balakrishna Leaked sreeleela character in bhagavanth Kesari movie

భగవంత్ కేసరీ ఇంట్రెస్టింగ్ అప్టేట్: ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ ఎప్పిటికప్పుడు మూవీ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ వస్తున్నారు.అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల కాజల్ లుక్, శ్రీలీల లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న శ్రీలీల గురించి బాలయ్య బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Nandamuri Balakrishna Leaked sreeleela character in bhagavanth Kesari movie

శ్రీలీల క్యారెక్టర్ ను లీక్ చేసిన బాలయ్య: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ ఛైర్మన్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ ఆసుపత్రి 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. బాలకృష్ణతో పాటు బాడ్మింటన్ పీవీ సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రసంగిస్తూ శ్రీలీల క్యారెక్టర్ గురించి లీక్ చేశాడు. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల నటిస్తోంది.

Nandamuri Balakrishna Leaked sreeleela character in bhagavanth Kesari movie

భగవంత్ కేసరిలో ఫైటర్ గా శ్రీలీల: అయితే ఆమె గురించి బాలయ్య మాట్లాడుతూ... శ్రీలీల బిజీగా గడుపుతోంది. ఉదయాన్నే భగవంత్ కేసరి సినిమాలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చిందంటూ సినిమా సిక్రెట్ లీక్ చేశాడు బాలయ్య. అంతే కాకుండా ఈ ఫైట్స్ కోసం ఆమె ట్రైనింగ్ కూడా తీసుకుందట. మీరు ఆమె అద్భుత నటన సినిమాలో చూస్తారుగా మీకే తెలుస్తోందని.. ఇలా సినిమా సిక్రెట్ ను లీక్ చేశాడు బాలయ్య. ఇక ఈ సినిమాలో బాలయ్యకు కుమార్తెగా శ్రీలీల నటిస్తోందని ప్రచారాలు వచ్చాయి. అందులో నిజమెంతో తెలియదు. కానీ ఆమె ఓ ఫైటర్ పాత్రలో నటిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యలతో అర్థం అవుతోంది.

Nandamuri Balakrishna Leaked sreeleela character in bhagavanth Kesari movie

జోరు మీద ఉన్న శ్రీలీల: ప్రస్తుతానికి శ్రీలీల మంచి జోరు మీద ఉంది. ఏ ఒక్క సినిమాను వదలకుండా.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతుల్లో సెట్స్ మీద ఉన్న సినిమాలు 6 నుంచి 8 ఉన్నాయి. సెట్స్ మీద ఉన్నవే కాకుండా... ఇంకా అనౌన్స్ చేయని సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరి హీరోలకు ఆమె ఛాన్స్ అవుతుండటం విశేషం.

Nandamuri Balakrishna Leaked sreeleela character in bhagavanth Kesari movie

సరికొత్త పాత్రలో బాలయ్య: ఇక ఈ సినిమా విషయానికి వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న పాత్రలో క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X