Balakrishna కాలికి గాయం... ఆహా షూట్ చేస్తున్న సమయంలో అలా.. ఏం చేశారంటే?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. తరువాతి సినిమా ప్రారంభించే ముందే ఆయన ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ అయిన ఆహా కోసం ఒక టాక్ షో చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రమోషన్ అలాగే ఫోటో షూట్ కూడా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

అఖండ కోసం వెయిటింగ్
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఇక సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వరుస సినిమాలు
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిందని అంటున్నారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో ఆదిత్య 369 సీక్వెల్ సినిమా చేయబోతున్నారు.

‘ఆహా’ కోసం బాలయ్య
తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం బాలయ్య పని చేయనున్నారని ఈ పాపులర్ ఓటీటీ కోసం బాలయ్య ఓ స్పెషల్ టాక్ షో హోస్ట్ గా ఉండనున్నారు. అయితే ఈ షో కోసం ఆహా టీం పెద్ద లిస్ట్ రెడీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ సహా టా లీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.

కృష్ డైరెక్షన్లో
ఈ టాక్ షోకి ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. బాలయ్యతో అనుబంధం ఉన్న దర్శకుడైతే ఈ టాక్ షోని సమర్థవంతంగా నిర్వహించగలడని ఆహా భావించిం ఆ బాధ్యత క్రిష్‌పై పెట్టిందని అంటున్నారు. బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ తీశారు క్రిష్, గౌతమి పుత్ర శాతకర్ణితో వారి అనుబంధం మొదలైంది. అందుకే.. క్రిష్ కే ఆ బాధ్యత అప్పగించారనే ప్రచారం జరుగుతోంది.

బాలయ్య కాలికి చిన్న గాయం
అదలా ఉంచితే ఈ రోజు జరిగిన ఆహా టాక్ షో ఫోటో షూట్ సమయంలో బాలయ్య కాలికి చిన్న గాయం అయిందని అంటున్నారు. కానీ బాలయ్య సమయం వృధా చేయకుండా గాయాన్ని లెక్కచేయకుండా ఫోటో షూట్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. త్వరలోనే ప్రోమో, ఫొటోలతో కలిపి ఆహా సంస్థ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి ఈ ప్రకటన ఎప్పుడు రానుంది అనేది.


Click it and Unblock the Notifications











