NBK109: బాబీ మూవీలో బాలయ్య పాత్ర లీక్.. కెరీర్‌లో తొలిసారి డిఫరెంట్‌గా!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఫుల్ జోష్‌తో సత్తా చాటుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 109వ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రస్తుతం నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య కెరీర్‌లోనే క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా సాగుతోన్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఆయన డుయల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలకృష్ణ మూడు గెటప్‌లలో కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది.

బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ మాఫియా డాన్ రోల్‌ను చేస్తున్నారట. ఇది ఆయన గత చిత్రాల్లో ఎప్పుడూ కనిపించని విధంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
ఇదిలా ఉండగా.. బాలయ్య - బాబీ కలిసి చేస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











