బాలయ్య కోసం అలాంటి బ్యాక్ డ్రాప్ పవర్ఫుల్ కథను సెట్ చేస్తున్న బోయపాటి.. ఎలా ఉంటుందంటే?
నందమూరి బాలకృష్ణతో మాస్ దర్శకులు సినిమా చేయడానికి ఎంతగా ఆసక్తిని చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరైన కాంబినేషన్ పడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు మామూలుగా నమోదు కావు అని చెప్పవచ్చు. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా రాబోతోంది అంటేనే అంచనాలు ఆకాశాన్ని దాటిస్తాయి. ఇప్పటివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకొని ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
ఇక వీరి కలయికలో భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి అని అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత 109వ సినిమాను బాలయ్య బాబు బోయపాటికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అందిన ఒక టాక్ ప్రకారం అయితే సినిమాను పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి యువ హీరో రామ్ పోతినేనితో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే మరోవైపు బోయపాటి గ్యాప్ దొరికినప్పుడల్లా బాలకృష్ణ కోసం ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి రాజకీయ అంశాలు కూడా ఉంటాయట.
గతంలో లెజెండ్ లో కూడా కొన్ని రాజకీయ అంశాలు టచ్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం బోయపాటి పొలిటికల్ పాయింట్స్ ను స్ట్రాంగ్ గా టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎడాది ఆ ప్రాజెక్టును మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే బాలయ్య బాబు కోసం మరో ఇద్దరు దర్శకులు కూడా క్యూలో ఉన్నారు. అందులో బలగం దర్శకుడు వేణు తో పాటు వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కూడా ఉన్నాడు. కానీ బాలయ్య మాత్రం బోయపాటి సినిమా తరువాతనే మరో ప్రాజెక్టును ఓకే చేయాలని అనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











