HBD Nandamuri Balakrishna: వెండితెర సింహ.. రికార్డుల్లో లెజెండ్.. బాలయ్య ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈరోజు. తండ్రి అడుగుజాడల్లో నటనలో ఓనమాలు దిద్ది.. నేడు తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకరిగా నిలిచారు బాలయ్య. నటుడిగానే కాకుండా శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా తనదైన ముద్ర వేశారు బాలయ్య. ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ జీవితంలోని ఆసక్తికర విషయాలు ఒకసారి పరిశీలిస్తే..

14 ఏళ్ల వయసులో నటుడిగా
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 10 జూన్ 1960న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం చదువుకున్న బాలయ్య .. 1982లో వసుంధరను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తెలు బ్రాహ్మాణి, తేజస్విని.. కుమారుడు మోక్షజ్ఞ తేజ సంతానం. 14 ఏళ్ల వయసులో 1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల సినిమాలో బాలనటుడిగా తొలిసారిగా కెమెరా ముందుకొచ్చారు బాలయ్య. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట్ పర్వం తదితర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు.

Nandamuri Balakrishna Net Worth here s the Akhanda 2 Actor s Net Worth And Assets Details

1984లో హీరోగా ఎంట్రీ
1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ పడుతూ లేస్తూ సాగుతున్న ఆయన కెరీర్‌ను మంగమ్మగారి మనవడు చిత్రం మలుపు తిప్పింది. ఈ చిత్రంతో బాలయ్య వెనుదిరిగి చూసుకోలేదు. 1987లో బాలకృష్ణ నటించిన 8 చిత్రాలు విడుదలవ్వగా.. అవన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 బాలకృష్ణ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. సమరసింహారెడ్డితో తెలుగునాట ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్ చేసిన బాలయ్య అనంతరం నరసింహనాయుడుతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు.

నటుడిగా 50 ఏళ్లు పూర్తి
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గతేడాదితో 50 ఏళ్ల వేడుకను పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో తన 110వ చిత్రం అఖండ 2లో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేనితో తన 111 చిత్రంలో నటించనున్నారు బాలకృష్ణ. ఈ తరంలో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, ఫిక్షన్, సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు బాలయ్యే. బుల్లితెరపై హోస్ట్‌గానూ బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోకు వ్యాఖ్యాతగా అదరగొట్టారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే
సినిమాలే కాదు రాజకీయాల్లోనూ బాలకృష్ణ తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి తన సహాయ సహకారాలు అందిస్తున్నారు బాలయ్య. పార్టీ తరపున ప్రచారం నిర్వహించి అభ్యర్ధుల విజయంలో కీలకపాత్ర పోషించారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2019, 2024లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక తన తల్లి పేరిట నెలకొల్పిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. బాలయ్య వచ్చిన తర్వాత హాస్పిటల్ రూపురేఖలు మారిపోయాయి.

పద్మభూషణ్‌తో సత్కరించిన కేంద్రం
50 ఏళ్ల నట జీవితం, ఎమ్మెల్యేగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా చెరగని ముద్ర వేసిన బాలయ్యకు ఈ ఏడాది భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డ్‌ను ఆయనకు ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్‌ను బాలకృష్ణకు ప్రకటించింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు .. అలాగే తనకు రూ.9.9 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

బాలయ్య కంటే వసుంధరకే ఆస్తులు
బాలయ్య సతీమణి నందమూరి వసుంధరా దేవి పేరిట రూ.140.38 కోట్లు ఆస్తులు ఉన్నట్లు బాలయ్య తెలిపారు. అలాగే వసుంధరకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. బాలకృష్ణకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇటీవలే రూ.35 కోట్లతో మరో కొత్త ఇల్లు కొన్నట్లుగా ఫిలింనగర్ టాక్. బాలయ్య గ్యారేజీలో కోట్ల విలువైన బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న నందమూరి బాలకృష్ణ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Read more about: nandamuri balakrishna akhanda 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X