నయా నటసింహాం: షాక్‌కు గురి చేస్తోన్న బాలకృష్ణ కొత్త లుక్.. అందుకోసమే ఇలా అయిపోయాడట.!

By Manoj

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. సీనియర్ హీరోనే అయినా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నాడు. కరోనా ప్రభావంతో బాలయ్య ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన బాలయ్యను చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఆ వివరాలు మీకోసం.!

నందమూరి హీరోకు వరుసగా మూడు షాక్‌లు

నందమూరి హీరోకు వరుసగా మూడు షాక్‌లు

నందమూరి బాలకృష్ణకు గత ఏడాది సినిమాల పరంగా వరుసగా మూడు షాక్‌లు తగిలాయి. 2019లో ఆయన ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలతో పాటు ‘రూలర్' అనే సినిమాలో నటించాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. వీటిలో తన తండ్రి జీవిత చరిత్రకు బాలయ్య నిర్మాతగానూ వ్యవహరించడంతో నష్టాలు ఎదురయ్యాయి.

హ్యాట్రిక్ కొట్టాలి.. బరిలో నిలవాలని కలిశాడు

హ్యాట్రిక్ కొట్టాలి.. బరిలో నిలవాలని కలిశాడు

వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు నందమూరి హీరో బాలయ్య. ఈ క్రమంలోనే ఆయన తనకు ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు సూపర్ హిట్లు అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిశాడు. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు హ్యాట్రిక్ కొట్టాలని ఈ ఇద్దరూ భావిస్తున్నారు.

ఎన్నో వస్తున్నాయి.. క్లారిటీ మాత్రం రాలేదు

ఎన్నో వస్తున్నాయి.. క్లారిటీ మాత్రం రాలేదు


సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే మరోసారి పవర్‌ఫుల్ స్టోరీతో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, వాటిపై చిత్ర యూనిట్ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సినిమా వివరాలు గోప్యంగానే ఉన్నాయి.

అది మాత్రం హైలైట్.. పుకార్లు షికారు

అది మాత్రం హైలైట్.. పుకార్లు షికారు

ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి కూడా పలు వార్తలు ప్రచారం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య గుండుతో కనిపించిన లుక్ ఎప్పటి నుంచో హాట్ టాపిక్ అవుతోంది.

షాక్‌కు గురి చేస్తోన్న బాలకృష్ణ కొత్త లుక్

షాక్‌కు గురి చేస్తోన్న బాలకృష్ణ కొత్త లుక్

నందమూరి బాలకృష్ణ కొద్ది రోజులుగా గుండుతో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం నందమూరి హీరో తెల్లటి జుట్టు, నల్లటి మీసంతో కనిపిస్తున్నారు. శనివారం జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు వచ్చాడు బాలయ్య. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Mahesh Babu's Next Movie Would Be Among These Directors

అందుకోసమే ఆయన ఇలా అయిపోయాడట.!


ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇందులో ఆయన అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన ఇప్పుడున్న లుక్‌తో కనిపిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ లుక్‌లో ఆయన చాలా సన్నగా కూడా కనిపిస్తున్నారు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X