twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mokshagna Teja ఎంట్రీ కోసం అపజయం లేని దర్శకుడు.. రిస్క్ లేకుండా బాలయ్య ప్లాన్?

    |

    నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఇంతవరకు బాలకృష్ణ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే గత ఐదేళ్లుగా బాలకృష్ణ తనయుడు మొదటి సినిమా కథ కోసం ప్రముఖ దర్శక రచయితల తో చర్చలు జరుపుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తరువాత ప్రాజెక్టు పై ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం రిస్క్ లేకుండా బాలకృష్ణ ఒక దర్శకుడిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఎన్నిసార్లు చర్చలు జరిపినా..?

    ఎన్నిసార్లు చర్చలు జరిపినా..?

    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజను ఎలాగైనా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆయన గత ఐదేళ్లుగా వారసుడి మొదటి సినిమాకు సంబంధించిన కథ కోసం చాలామంది దర్శక రచయితల తో కూడా చర్చలు జరిపారు. కానీ ఎన్నిసార్లు కూర్చున్నా కూడా సరైన కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. దర్శకుల విషయంలో కూడా ఆయన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

    ఆ సినిమాకు సీక్వెల్..?

    ఆ సినిమాకు సీక్వెల్..?

    ఇంతకుముందు అయితే బాలకృష్ణ తన దర్శకత్వంలోనే కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని కూడా అన్నారు. ఆదిత్య369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 ప్రాజెక్టుతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని ఆ ప్రాజెక్ట్ కోసం కథను కూడా ఫైనల్ చేసినట్లుగా తెలియజేశారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర స్క్రిప్టు మొత్తం పూర్తిగా రెడీ చేస్తున్నట్లుగా కూడా వివరణ ఇచ్చారు. కానీ ఇంకా ఆ విషయంపై మరొక అప్డేట్ అయితే ఇచ్చింది లేదు.

    సిద్దమవుతున్న మోక్షజ్ఞ

    సిద్దమవుతున్న మోక్షజ్ఞ

    ప్రస్తుతం మోక్షజ్ఞను చూస్తూ ఉంటే అతను హీరోగా ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఫిట్నెస్ విషయంలో కూడా ఇంకా అనుకున్నంతగా మార్పులు ఏమీ చేయలేదని కూడా అర్థం అవుతోంది. ఇక మొత్తానికి రీసెంట్ గా అయితే బాలకృష్ణ సలహాతో కొడుకు ఫిట్నెస్ విషయంలో మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

    ఆ దర్శకులతో చర్చలు..?

    ఆ దర్శకులతో చర్చలు..?

    గతంలో అయితే బోయపాటి శ్రీను దర్శకత్వం లోనే మోక్షజ్ఞ తేజ్ మొదటి సినిమా రాబోతుంది అని చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. నిజానికి బాలకృష్ణ కూడా అదే పర్ఫెక్ట్ అని కూడా ఒకసారి ఆలోచించాడు. కానీ తర్వాత సన్నిహితులు సలహా మేరకు మళ్ళీ ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. మధ్యలో పూరి జగన్నాథ్ పేరు కూడా బాగానే వైరల్ అయింది కానీ ఆ ఈ విషయంలో కూడా బాలకృష్ణ ఎటూ తేల్చలేక పోయారు.

    రిస్క్ లేకుండా..

    రిస్క్ లేకుండా..

    ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రిస్క్ లేకుండా మినిమమ్ సక్సెస్ అందుకున్న దర్శకుడిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల F3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన అనిల్ రావిపూడితో ఎలాంటి భయం లేకుండా కొడుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అని బాలకృష్ణ ఆలోచిస్తున్నారట.

    అనిల్ అయితే కొత్త తరహాలో అన్ని రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేయగలడు అని కమర్షియల్ గా మోక్షజ్ఞను ఎలివేట్ చేయగలడు అనే నమ్మకంతో అతన్ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

    English summary
    nandamuri balakrishna once again discussion on Mokshagna Teja first movie director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X