దటీజ్ బాలకృష్ణ: ఏకంగా కరోనా పేషెంట్‌తో!
దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు నటసింహా బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలో తండ్రి సినిమాల్లో నటించిన ఆయన.. 'సాహసమే జీవితం' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో రావడంతో పాటు ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఫలితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు.
అంతేకాదు, ఏ హీరోకూ లేని విధంగా అభిమాన సంఘాలు ఆయన పేరుపై ఉన్నాయి. అయినప్పటికీ.. ఫ్యాన్స్ విషయంలో బాలయ్య వ్యవహరించే తీరుపై విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన తన అభిమాని కోసం ఎవరూ చేయని పని చేసి 'దటీజ్ బాలయ్య' అనిపించుకున్నాడీ నందమూరి హీరో. ఆ వివరాలు మీకోసం.!

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్
సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు నందమూరి బాలకృష్ణ. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన సినిమా చేసుకుంటూ వెళ్లడంతో ఎన్నో విజయాలు అందుకున్నాడు. అదే సయమంలో రాజకీయాల్లోనూ ఆయన సత్తా చాటుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన ఏకంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సామాజిక సేవలోనూ ముందుండే నటసింహాం
చాలా కాలంగా సెలెబ్రిటీగా వెలుగొందుతోన్న బాలయ్య.. సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. ఏదైన విపత్తు సంభవించినప్పుడే.. క్లిష్ట సమయాల్లోనో ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఎంతో మంది పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్.. ఏకంగా రూ. 1 కోటి 25 లక్షలు
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు మొత్తం పోరాటం చేస్తున్నాయి. ఇందుకోసం సెలెబ్రిటీలు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు అందించారు. అలాగే, సినీ కార్మికులకు రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.

పోరాటం చేస్తున్న వారికి అండగా బాలకృష్ణ
కరోనా నివారణ కోసం తన వంతు సాయంగా విరాళం ప్రకటించిన బాలకృష్ణ... తనకు సంబంధించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో.. హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వాళ్లకు, హాస్పిటల్‌లో పనిచేస్తున్న దివ్యాంగులకు, పారా మెడికల్ సిబ్బందికి పారా మెడికల్ సిబ్బందికి నిత్యవసరాలు అందించారు.

దటీజ్ బాలకృష్ణ: ఏకంగా కరోనా పేషెంట్‌తో.!
ఫ్యాన్స్ విషయంలో వ్యవహరించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో బాలయ్య ఓ అద్భుతమైన పని చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ అభిమానికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నటసింహా.. అతడికి స్వయంగా ఫోన్ చేశారు. దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడి ‘నేనున్నా భయపడకు' అని అతడికి ధైర్యం చెప్పారు. ఈ కాల్ రికార్డ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Recommended Video

వరుస దెబ్బలు.. అస్సలు తగ్గని బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. గత ఏడాది మూడు సినిమాల్లో నటించారు. అవన్నీ దారుణంగా పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బీ గోపాల్‌తో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











