నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బాలయ్య పవర్‌ఫుల్ లుక్ వచ్చేది ఆరోజే

గతంలో 'జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

 Nandamuri Balakrishna Police Look Release Date Fix

ఈ సినిమా బాలకృష్ణ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే, ఈ సినిమాలో బాలయ్య పోలీస్‌ లుక్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత సీ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. ఇక, దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సెకెండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని బాలయ్య పోలీస్ లుక్ దసరా రోజు విడుదల కానుందట. ఈ వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X