ఆమె కోసం లవర్ బాయ్‌లా మారుతున్న బాలయ్య: కరోనా ఉన్నా తగ్గేదేలేదంటున్నాడు

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రం 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ నిన్న మొన్నటి వరకూ జరిగింది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ ఎక్కువ అవుతుండడంతో.. చిత్రీకరణకు బ్రేక్ చెప్పారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో పున: ప్రారంభం కాదన్న టాక్ గట్టిగా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో 'అఖండ' సినిమా చిత్రీకరణ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కరోనా ప్రభావం ఉన్నా.. దీన్ని మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' షూటింగ్ మే 12 నుంచి పున: ప్రారంభం కాబోతుందట. ఇందులో నందమూరి బాలకృష్ణతో పాటు హీరోయిన్‌గా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ కూడా భాగం కాబోతుందని తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లపై లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. సినిమాలోనే కీలకంగా ఉండే ఈ సన్నివేశాల కోసం బోయపాటి అదిరిపోయే డైలాగులతో పాటు ఎమోషన్స్ ప్లాన్ చేశాడట. అలాగే, బాలయ్య ఏజ్‌కు తగ్గట్లుగానే ఈ ప్రేమను చూపించబోతున్నాడని కూడా తెలిసింది. దీంతో ఈ ట్రాక్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Nandamuri Balakrishna Pragya Jaiswal Love Scenes Highlight in Akhanda

ఇక, 'అఖండ' మూవీలో ప్రగ్యా జైస్వాల్ పోషించేది ఐఏఎస్ పాత్ర అని తెలిసింది. ఓ జిల్లాకు కలెక్టర్‌గా పని చేసే సమయంలో.. ఆ ఊరి పెద్ద అయిన బాలకృష్ణతో ప్రేమలో పడుతుందట ఈ భామ. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాతో పాటు పూర్ణ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X