నాగ బాబు కామెంట్లపై... బాలయ్యను ప్రశ్నించిన మీడియా, ఎలా రియాక్టయ్యారంటే?

Recommended Video

NTR Biopic : Balakrishna Responds On Nagababu Comments | Filmibeat Telugu

ఓ వైపు సంక్రాంతి పండగ సందర్భంగా విడుదవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాల సందడి కొనసాగుతుంటే... 'నాగబాబు వర్సెస్ బాలయ్య' ఇష్యూ కూడా అదే స్థాయిలో మీడియాలో చర్చనీయాంశం అయింది.

తన తాజా చిత్రం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న బాలయ్య.... తనను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బాలయ్యను ఎలాగైనా ఈ విషయంపై రియాక్ట్ అయ్యేలా చేయాలని మీడియా వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నో కామెంట్ అంటూ స్కిప్ చేసిన బాలయ్య

నో కామెంట్ అంటూ స్కిప్ చేసిన బాలయ్య

సినిమా ప్రమోషన్లో భాగంగా బెంగుళూరు వెళ్లిన బాలయ్యను మీ గురించి నాగబాబు విడుదల చేస్తున్న వరుస వీడియోలపై స్పందించాలని కన్నడ మీడియా ప్రతినిధులు కోరగా.... ‘నో కామెంట్' అంటూ ఆయన వారి ప్రశ్నను స్కిప్ చేశారు. ఇది పాలిటికల్ మీటింగ్ కాదని, సినిమా ప్రమోషన్ అని స్పష్టం చేశారు.

నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా... అనే కామెంటుపై

నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా... అనే కామెంటుపై

‘నిజం క్కలేని బయోపిక్కులొద్దమ్మా..' అంటూ నాగబాబు చేసిన కామెంట్లపై స్పందించాలనికోరగా మరోసారి బాలయ్య ‘నో కామెంట్' అంటూ ఈ విషయాన్ని దాట వేశారు. బాలయ్య తీరు చూస్తుంటే సినిమా విడుదల వేళ వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై స్పందించాలని కోరగా.... ‘మాది మాత్రమే బయోపిక్, ఆయన ఏం తీస్తున్నారో నాకు తెలియదు. మేము సినిమాలో చెప్పింది నాన్నగారి, అమ్మగారి కథ. సినిమాలో ప్రధానంగా అదే తీసుకున్నామని' బాలయ్య స్పష్టం చేశారు.

నా ఫేవరెట్ యాక్టర్ ఆయనే...

నా ఫేవరెట్ యాక్టర్ ఆయనే...

కన్నడలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అని కన్నడ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘రాజ్ కుమార్ గారు... అందులో సందేహమే లేదు' అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. నాన్నగారు ఆ రోజుల్లో అన్ని భాషల నటులను ప్రోత్సహిస్తుండేవారు. కన్నడ నుంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. శ్రీకృష్ణ పాండవీయంలో భీముడిగా చేయించారని బాలయ్య గుర్తు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X