HanuMan హనుమాన్ 2 కోసం వెయింటింగ్.. బాలయ్య హాట్ కామెంట్.. దర్శకుడు,నిర్మాతతో ఏం చెప్పారంటే?
ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన విజయం సాధిస్తున్న హనుమాన్ సినిమాపై నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల ప్రభంజనం సాగిస్తున్న ఈ సినిమాను ఇటీవల నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు సతీమణి వసుంధర, తన కుటుంబ సభ్యులతో వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ నిర్మాత, దర్శకుడు, నటీనటులకు అభినందనలు తెలిపారు. ఆయన చెప్పిన విషయాల వివరాల్లోకి వెళితే..
Recommended Video

హనుమాన్ సినిమా విడుదలైన ప్రతీ చోట అన్ని వర్గాల నుంచి అద్బుతమైన స్పందనను కూడగట్టుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కోరిక మేరకు బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో బుధవారం (జనవరి 16వ తేదీన) వీక్షించారు. అనంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందించారు.

హనుమాన్ సినిమాను వీక్షించిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో బోలెడంత కంటెంట్ ఉంది. ప్రశాంత వర్మ నీవు బాగా హ్యాండిల్ చేశావు. అంతా ఆంజనేయస్వామి ఆశీస్సులు. శ్రీరామచంద్రుడి భక్తుడు దీవెనలు ఉంటాయి. మీ టేకింగ్ బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలని ఉంది. సినిమాపై మీ తపన కనిపించింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
హనుమాన్ సినిమా విషయంలో మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా ఉంది. సినిమా చాలా నచ్చింది. దర్శకుడి నుంచే కాదు.. నిర్మాత నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండటమే ఈ సినిమా బాగా రావడానికి కారణమైంది. రెండున్నర ఏళ్లు ఈ సినిమా నిర్మించడం మామూలు విషయం కాదు. అందుకు నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందించాలి అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

హనుమాన్ సినిమాలో సినిమాటోగ్రఫి బాగుంది. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. అలాగే మ్యూజిక్, పాటలు బాగున్నాయి.ఆర్టిస్టులు అందరు చక్కగా నటించారు. అన్నీ చక్కగా కుదిరాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా రూపొందించారు. హనుమాన్ 2 కోసం వెయింటింగ్ అని నందమూరి బాలకృష్ణ చెప్పారు.
హనుమాన్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఉత్తరాదిలో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. హిందీలో 19 కోట్ల నికర వసూళ్లు నమోదు చేయగా.. ఇండియావైడ్ 67 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 30 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా 116 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











