#NBK108 చరిత్ర సృష్టించనున్న బాలకృష్ణ .. తెలుగు సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఫ్యాన్స్‌కు భారీ పండగ!
గాడ్ ఆఫ్ మాసెస్, సినీ హీరో, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీ నందమూరి నటసింహం బర్త్ డేను పురస్కరించుకొని దర్శకుడు అనిల్ రావిపూడి భారీగా ప్లాన్ చేశాడు. బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా టైటిల్‌ను అదిరిపోయేలా రివీల్ చేసేందుకు సిద్దమయ్యాడు. #NBK108 సినిమా టైటిల్ లాంచ్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చేందుకు #NBK108 చిత్ర యూనిట్ సిద్దమైంది. ఈ సినిమా టైటిల్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో లాంచ్ చేయడానికి భారీ ప్లాన్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఏ హీరో సినిమాకు చేయని విధంగా #NBK108 సినిమాకు ప్లాన్ చేశారు.

#NBK108 సినిమా యూనిట్ వెల్లడించిన ప్రకారం... 108 లొకేషన్లలో, టైటిల్ పోస్టర్లతో కూడిన 108 హోర్టింగులను ఏర్పాటు చేయనున్నారు. టైటిల్ ప్రకటించే వేడుకను అట్టహాసంగా చేసేందుకు ప్లాన్ చేశారు. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూన్ 8వ తేదీన ఉదయం 9.10 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని రివీల్ చేయనున్నారు.
#NBK108 చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించనున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణకు సంబంధించి రెండు లుక్స్‌ను నిర్మాతలు ఉగాది రోజున రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీత అందిస్తున్నారు. సీ రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ థమన్
సినిమాటోగ్రాఫర్: సీ రాంప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
ఫైట్స్: వీ వెంకట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్ కృష్ణ


Click it and Unblock the Notifications











