Veera Simha Reddy బాలయ్య సింగిల్ హ్యాండ్ సెంచరీ.. వీరసింహారెడ్డి శతదినోత్సవం వేడుక ఎక్కడంటే?
నట సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన ఈ చిత్రం రికార్డు ఒపెనింగ్స్ సాధించడంతోపాటు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అరుదైన ఘనతను సాధించింది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా వీరసింహారెడ్డి అదే ఊపును కొనసాగించలేకపోయింది. అయితే రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం కలెక్షన్ల పరంగా సత్తాను చాటింది. అయితే ఈ చిత్రం ఎన్ని సెంటర్లలో శతదినోత్సవం జరుపుకొంటున్న వివరాల్లోకి వెళితే..
బాలయ్య, వరలక్ష్మీ మధ్య సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం తొలి రోజు కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. తొలి రోజు 54 కోట్ల గ్రాస్, 32 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. వీరసింహారెడ్డి చిత్రం కలెక్షన్లకు అడ్డాగా మారింది. సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం అభిమానులకు పండుగ వాతావారణాన్ని తెచ్చిపెట్టింది.

ఇక వీరసింహారెడ్డి చిత్రం అభిమానుల అంచనాలు దాటుకొంటూ శతదినోత్సాన్ని పూర్తి చేసుకొన్నది. హిందూపురంలోని గురునాథ్, చిలకలూరి పేటలో రామకృష్ణ, ఆలూరులో ఎస్ఎల్ఎన్ టాకీస్, ఆదోని సత్యం కాంప్లెక్స్, కర్నూలులో ఆనంద్ స్క్రీన్ 3 (51 రోజులు), రాధాకృష్ణ (57వ రోజు), ఆళ్లగడ్డలో ప్రతాప్ 29 (రోజులు), శ్రీరామ (71వ రోజు), గుంటూరులో నాజ్ కాంప్లెక్స్ (69 రోజులు), శ్రీలక్ష్మీ పిక్చర్స్ ప్యాలెస్ (31వ రోజు), విజయవాడలో అలంకార్ (36 రోజులు), శంకుతల (64వ రోజు) లో వంద రోజుల పండుగను జరుపకోవడానికి సిద్దమైంది.
ఇక వీరసింహారెడ్డి చిత్రం శతదినోత్సవ వేడుకలు హిందూపురంలో బాసన్నపల్లిలోని ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీలో మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా నిర్వహించనున్నారు.



Click it and Unblock the Notifications











