హీరోలు రాజకీయాల్లోకి వచ్చి అడ్రస్, నామ రూపాలు లేకుండా పోయారు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
నట సింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకొన్న నేపథ్యంలో ఆయనకు హిందూపురంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఆయనను పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సన్మానించుకొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వాడివేడి ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. బాలయ్య చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
నేను సినిమా నటుడు అని కాదు.. నాలో నిజాయితీ, నిబద్దత, మానవత్వం వల్లే నాకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇలాంటి క్వాలిటీస్ వల్లే ముందు ముందు తరాలు.. భవిష్యత్‌లో కూడా అభిమానులు పుట్టు కొస్తారు. మీ అభిమానానికి శిరసు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకొంటాను అని బాలకృష్ణ అన్నారు.

నా మాదిరిగా సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు హీరోగా ఎవడు లేరు. చాలా మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. 50 సంవత్సరాలు హీరోగా నిలబడే శక్తిని ఇచ్చారు. ఇన్నాళ్లు హీరోగా నిలబెట్టిన తెలుగు జాతికి, తెలుగు వాడికి రుణపడి ఉంటాను అని బాలయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వరుసగా నాలుగు హిట్లు ఇచ్చాను. ఇక నుంచి నా రెండో ఇన్సింగ్స్ మొదలవుతుంది. ఇక నుంచి నేనేంటో చూపిస్తా.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు. తట్టుకోలేరు. మాడిపోతారు. ఇక ముందు చూపిస్తా అంటూ డైలాగ్ కొడుతూ అభిమానులను, కార్యకర్తలను జోష్‌లో ముంచెత్తారు. మీ అంచనాలకు అందని విధంగా సినిమాలు చేస్తాను. నాకు వయసు అయిపోతుందనే బాధ లేదు. ఆకలి మీద ఉన్నప్పుడే పంచ భక్ష పరమాన్నం వడ్డించాలి అంటూ హామీ ఇచ్చారు.
హిందూపూర్ ప్రజలు ఆదరించడం వల్లే మూడోసారి ఎమ్మెల్యేగా అయ్యాను. నా నిజాయితీని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. రాజకీయాల్లోకి నటులు ఎంతో మంది వచ్చారు. కానీ నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యేగా కావాలని లేదు. ఎంతో మంది వచ్చారు. నామరూపాలు లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇక్కడ పనులు చేయడం వల్లే నన్ను గెలిపించారు. సినిమా యాక్టర్, రామారావు అబ్బాయి అని మాత్రం గెలిపించలేదు. నా పనితీరును బట్టే నాకు విజయం అందించారు అని బాలకృష్ణ అన్నారు.
నటుడిగా నాకు పద్మభూషణ్ ఇచ్చారు. సరే. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారత ఇచ్చినప్పుడే తెలుగు వారికి గౌరవం దక్కుతుంది. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రతీ తెలుగు వాడి కోరిక అని బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











