నాకు, నా భార్యకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా!.. బాలకృష్ణ సీరియస్
అన్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా , ఆయన అడుగుజాడల్లోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. 1974లో తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ''తాతమ్మ కల '' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు బాలయ్య. ఎన్టీఆర్ తరహాలోనే పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మ, సోషియో ఫాంటసీ వంటి అన్ని రకాల జోనర్స్‌లలో నటించారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న టాలీవుడ్ బాలకృష్ణను ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే.
60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు మించి కష్టపడుతున్నారు బాలయ్య . ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేయాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై అన్‌స్టాపబుల్ అంటూ అడుగుపెట్టి హోస్టింగ్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించారు బాలయ్య. త్వరలోనే అన్‌స్టాపబుల్ 3తో మనముందుకు రానున్నారు ఈ నందమూరి అందగాడు. ప్రస్తుతం బాలకృష్ణ .. బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య మూడు గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

సినిమాలు, షూటింగ్సే కాదు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా వేలాది మందికి నాణ్యమైన వైద్యం అందేలా చేస్తున్నారు. ఇక తండ్రి అడుగు జాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో అతిరథ మహారథుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. కాకినాడకు చెందిన ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్‌పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె అయిన వసుంధరది సంపన్నుల కుటుంబమే. బాలయ్య - వసుంధరలకు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారు మోక్షజ్ఞ సంతానం . భర్త సినిమాలు, ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో వసుంధర కుటుంబ వ్యవహారాలు, పిల్లల బాధ్యతలు స్వీకరించారు.

బాలకృష్ణకు అన్నింట్లో చేదోడు వాదోడుగా నిలిచారు. అంతేకాదు వసుంధరది గోల్డెన్ హ్యాండ్ అని ఫిలింనగర్ టాక్. ఆమె చేత్తో ఎవరికైనా డబ్బులిస్తే వారికి బాగా కలిసి వస్తుందని టాలీవర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఈ మధ్య జరిగిన 50 ఇయర్స్ వేడుకలో భార్యను ఆకాశానికెత్తేశారు బాలకృష్ణ. తాను వేసిన ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచిన వసుంధరకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే బాలయ్య - వసుంధరలు ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ఇదిలాఉండగా.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను నందమూరి బాలకృష్ణ , సినీ నటి మీనాక్షి చౌదరి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బాలయ్యను మీరు ఎప్పుడైనా మీ భార్యకు చీర కొని తీసుకెళ్లారా అని రిపోర్టర్ అడగ్గా.. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు, అనవసరంగా పుల్లలు పెట్టడం అంటూ సరదాగా అంటారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











