twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీలో బాలయ్య బూతులు.. అక్కినేని వర్ధంతి రోజే తొక్కినేని అంటూ షాకింగ్ కామెంట్స్

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతిలో భారీ స్థాయిలో ఒపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఇది సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో బాలయ్య బాబు మాట్లాడిన విధానం వారిని ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆకట్టుకున్న బాలయ్య

    ఆకట్టుకున్న బాలయ్య

    నందమూరి బాలకృష్ణ ఎప్పుడైనా సరే ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు చాలా వేగంగా ఎనర్జిటిక్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో కూడా ఆయన చాలా మాటలతోనూ ఆకట్టుకున్నారు. అయితే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఊహించిన విధంగా కాంట్రవర్సీగా మారాయి. ఓ వర్గం కూడా ఆయన మాట్లాడిన విధానంపై భిన్నమైన స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.

    బాలయ్య బూతులు

    బాలయ్య బూతులు

    సక్సెస్ ఈవెంట్ లో యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ అలాగే విశ్వక్సేన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న బాలయ్య బాబు అప్పట్లో హిందీలో ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం అంటూ నార్త్ ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసినా కూడా సాలే అంటూ మరొక బూతు పదం కూడా బాలయ్య నోట్లో నుంచి రావడంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. నిజం కాలేజీలో తన ఫ్రెండ్స్ తో ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవాడిని అని బాలయ్య బాబు తెలియజేశారు.

    ఒక గర్జనలా ఉండాలి,

    ఒక గర్జనలా ఉండాలి,

    ఇక ఈ సినిమాలో తన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఎంతగానో నచ్చింది అని ముఖ్యంగా చెన్నకేశవరెడ్డి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి సినిమా చేయాలని అనుకున్నట్లుగా మా ఇద్దరికీ అనిపించింది అని అన్నారు. నోటి మాట అనేది నిఖార్సుగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఒక గర్జనలా ఉండాలి, అలా ఉండాలి అంటే నాలాగా సింహం లా పుట్టాలి.. అని బాలకృష్ణ తెలియజేశారు.

    అక్కినేని తొక్కినేని..

    అక్కినేని తొక్కినేని..

    అయితే బాలకృష్ణ ఊహించిన విధంగా ఫ్లోలో ఒక మాట మాట్లాడిన విధానం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో నటించిన ఆర్టిస్టుల గురించి చెబుతూ.. "మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్ , వేదాలు శాస్త్రాలు నాన్నగారు ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం.. అని అన్నారు. ఆదివారం రోజు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో బాలయ్య మాట్లాడిన విధానంపై వారికి సంబంధించిన ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

     పొద్దున్నే మూడింటికి లేవగానే..

    పొద్దున్నే మూడింటికి లేవగానే..

    ఇక నందమూరి బాలకృష్ణ చుట్ట తాగుతాను అని కూడా ఒక వివరణ ఇచ్చారు. నేను పొద్దున్నే మూడింటికి లేవగానే చుట్ట తాగుతాను, ఎందుకంటే నా ఆరోగ్యం కోసం, నా డైలాగ్స్ కోసం, నా ఫైట్స్ కోసం.. అలాగే సినిమాలతో మీ అందరిని అలరించాలని కూడా ఆ విధంగా చేస్తానని బాలయ్య బాబు తెలియజేశారు. ఇక బాలయ్య మాట్లాడిన విధానంలో ఏదో ఫ్లోలో కొన్ని మాటలు అని ఉంటారు అని ఆయన కావాలని ఎవరిని కూడా హట్ చేయరు అని మరి కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరణ అయితే ఇస్తున్నారు.

    English summary
    Nandamuri balakrishna shocking comments at veera simha reddy pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X