Balakrishna Remuneration: భగవంత్ కేసరి కోసం బాలయ్యకు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ .. ఎంతో తెలిస్తే షాకే!
మరికొన్ని గంటల్లో బాలయ్య థియేటర్లలో గర్జించడానికి రెడీ అయ్యారు. ఆయన భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమా కోసం బాలయ్య గట్టిగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అఖండ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య... ఈ సినిమాకు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
బాలయ్య అఖండ సినిమాతో మళ్లీ.. కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య కొత్త అవతార్ లో దర్శనం ఇచ్చి... ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాంజనం సృష్టించింది. దీంతో ఆయన ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేశారు. ఈ సినిమాకి ముందు బాలయ్య రూ.8 కోట్ల నుంచి 10 కోట్లు వసూలు చేసే వారు. ఇక అఖండ సినిమా తర్వాత బాలయ్య కూడా రెమ్యూనరేషన్ పెంచేశారు.

అఖండ సినిమా తర్వాత బాలయ్య అన్ స్టాపబుల్ షో చేసిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. రెండో సీజన్ కూడా చేశాడు. అది కూడా ఓటీటీలో దుమ్ము లేపింది. ఇక ఈ అన్ స్టాపబుల్ షోస్ తర్వాత బాలయ్య ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్యకు మరింత ఊపు వచ్చిందనే చెప్పాలి.
ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య... అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి సారిగా తెలంగాణ యాసలో బాలయ్య మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ లోని డైలాగ్స్ పేలుతున్నాయి. ఇక ట్రైలర్ బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే.. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్, బీజీఎం... వేరే లెవెల్ అని చెప్పవచ్చు.

ఇక బాలయ్య సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మొదటి సారిగా నటిస్తుంది. ఇక టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటిస్తుంది. బాలయ్యను ఢీ కొట్టేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక తమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే.. అఖండ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య... ఈ సినిమాకు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు బాలయ్యకు భారీగానే సొమ్ము ముట్టచెప్పారని ఇన్ సైడ్ టాక్. ఇక బాలయ్య ఈ సినిమాకు దాదాపు రూ.30 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాకు ముందు 10 నుంచి 12 కోట్లు తీసుకునేవారట. వరుస హిట్లతో రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











