Mokshagna Teja: స్లిమ్ గా ఎన్టీఆర్ తరహాలోనే రెడీ అవుతున్న మోక్షజ్ఞ.. ఈ లుక్ మామూలుగా లేదు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ వారసులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు చిన్నతనం నుంచి ఫ్యాన్స్ లో కూడా ప్రత్యేకమైన ఆకర్షణను సంపాదించుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో నందమూరి అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే. రేపో మాపో ఎంట్రీ ఇచ్చేస్తాడు అని అనుకున్న ప్రతిసారి కూడా ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ తేజ లుక్కు చూస్తూ ఉంటే తప్పకుండా త్వరలోనే అతను టాలీవుడ్ హీరోగా కెరిర్ స్టార్ట్ చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..
కొద్ది రోజుల క్రితం ఆ నిర్మాత ఏమన్నారంటే..: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్న హీరోగా అడుగుపెడతాడు అని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలోనే బాలయ్య కొడుకు ఎంట్రీ గురించి ఖరారు చేశారు. అయితే ఎప్పుడు ఉంటుంది అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం బెల్లంకొండ గణేష్ బాబు మోక్షజ్న టాలీవుడ్ ఎంట్రీ వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం యాక్టింగ్ తో పాటు, డాన్స్ నేర్చుకునే పనిలో ఉన్నాడని చెప్పారు.

గతంలో మోక్షజ్ఞ కాస్తా లావుగా: అలాగే పెర్ఫెక్ట్ బాడీ తో అతనిని హీరోగా అందరూ చూడబోతున్నారని, దానికి తగ్గ అన్ని యాక్టివిటీస్ మోక్షజ్న ప్రస్తుతం చేస్తున్నాడని గణేష్ బాబు చెప్పాడు. గతంలో మోక్షజ్ఞ కాస్తా లావుగా కనిపించేవాడు. అలాగే బుగ్గలు పెద్దగా ఉంటూ చూడాటానికి కూడా అంత పెర్ఫెక్ట్ లుక్ ని మెయింటేన్ చేయలేదు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం తన లుక్ ని కూడా పూర్తిగా మార్చుకునే పనిలో పడ్డాడు.
లేటెస్ట్ స్లిమ్ లుక్ వైరల్: తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి మోక్షజ్న దిగిన ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫోటోలో అతను స్లిమ్ లుక్ లో కనిపించడం విశేషం. మునుపటి కంటే లుక్ పరంగా, బాడీ పరంగా చాలా వేరియేషన్ వచ్చిందని ఫోటోలలో స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి హీరో మెటీరియల్ గా మారేందుకు కావాల్సిన అన్ని వర్క్ అవుట్స్ చేసుకొని పెర్ఫెక్ట్ ఫీచర్స్ తో లాంచింగ్ కావడానికి మోక్షజ్న సిద్ధం అవుతున్నాడని స్పష్టం అవుతోంది.
దర్శకుడు ఎవరు?: మరి మోక్షజ్న డెబ్యూ ఏ దర్శకుడితో ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో బోయపాటి శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని పేర్లు కూడా ఉన్నాయి. దాంతో పాటు బాలకృష్ణ గతంలో ఆదిత్య 999 సినిమాని తన దర్శకత్వంలో మోక్షజ్న లీడ్ రోల్ లో తెరకెక్కిస్తానని చెప్పారు. మరి వీటిలో ఏ చిత్రంతో మోక్షజ్న ఎంట్రీ ఉంటుందనేది వేచి చూడాలి.

ఆ సినిమాతో బిజీగా బాలయ్య: ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంతో దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ తాజాగా లాంచ్ అయ్యింది. అలాగే బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో మూవీని పుట్టిన రోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనితో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











