వెండితెర కంటే ముందే ఓటీటీలో బాలయ్య వారసుడు.. మోక్షజ్ఞ ఎంట్రీపై మరో సర్‌ప్రైజ్‌

స్టార్ హీరోల వారసులు ఎవరు వెండితెరపై ఎంట్రీ ఇచ్చినా కూడా పనికి వచ్చే రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదు. ఎలాంటి సినిమా చేసినా కూడా విడుదల కాక ముందుకే భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుతూ ఉంటుంది. నందమూరి బాలకృష్ణ వారసుడు ఎప్పుడు తెరపైకి వస్తాడా అని ఆ వర్గం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాను కూడా బాలకృష్ణ డైరెక్షన్ చేస్తాడని గతంలో ఒక క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మోక్షజ్ఞ తేజ మొదటి ఎంట్రీ మొదట ఓటీటీలోనే ఉంటుందని మరొక టాక్ అయితే వస్తోంది.

అదే నిజమని..

అదే నిజమని..

నందమూరి మోక్షజ్ఞ తేజ గత ఏడాదిలోనే వెండితెరకు పరిచయం అవుతాడు అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. బాలకృష్ణ కూడా ఇంతకుముందు అదే నిజమని కూడా అన్నారు. తప్పకుండా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా వివరణ ఇచ్చారు. ఇక మధ్యలో అయితే మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావాలని లేదని చాలా కథనాలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని బాలయ్య ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.

ఆదిత్య 369 సీక్వెల్

ఆదిత్య 369 సీక్వెల్

గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అదిరిపోయేలా ఒక అప్ డేట్ అయితే ఇచ్చారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా తీయబోయే ఆదిత్య 999 సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతాడు అని తెలియజేశారు. అంతేకాకుండా ఆ సినిమాకు బాలకృష్ణ దర్శకత్వం వహించాలని అనుకున్నట్లు కూడా వివరణ ఇవ్వడం అప్పట్లో అభిమానుల్లో చర్చనీయాంశం గా మారింది. మధ్యలో బోయపాటి శ్రీను, క్రిష్ దర్శకత్వంలో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని కథనాలు వెలువడినప్పటికీ అందులో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

అంతకుమించి అనేలా ఉండాలని..

అంతకుమించి అనేలా ఉండాలని..

ప్రస్తుతం మరొక కొత్త టాక్ అయితే వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు ఇప్పుడే అతను ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులతో పాటు స్నేహితులు కూడా కోరుకుంటున్నారు. కానీ సరైన స్క్రిప్ట్ సెట్టయ్యే వరకు మోక్షజ్ఞ సినిమాల్లోకి రానివ్వకూడదు అని బాలయ్య ఆలోచిస్తున్నాడు. నందమూరి వారసుడు కాబట్టి ఎంట్రీ అంతకుమించి అనేలా ఉండాలని అనుకుంటున్నారు. సన్నిహితులు అభిమనుకు కూడా అదే కోరుకుంటున్నారు.

Recommended Video

Tollywood Top 10 Heroines List || Filmibeat Telugu
ఓటీటీలో బాలయ్యతో ఎంట్రీ

ఓటీటీలో బాలయ్యతో ఎంట్రీ

ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓటీటీలోకి సరికొత్తగా అన్ స్టాపబుల్ అనే షో ద్వారా ఏ చ్చిన విషయం తెలిసిందే.ఆహా షోకు అనేకమంది సినీ తారలు అతిథులుగా వస్తున్నారు. ఇక అందులో మోక్షజ్ఞ కూడా పాల్గొనే అవకాశం ఉందట. ఇప్పటివరకు వెండితెరపై కనిపించని మోక్షజ్ఞ మొదటిసారి తండ్రితో కలిసి ఓటీటీలోని టాక్ షోతో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అన్ స్థాపబుల్ కు సంబంధించిన సెట్ లో కూడా మోక్షజ్ఞ కనిపించడంతో ఒక్కసారిగా ఆ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక మొదటి సినిమాను ఎప్పుడు ఎలా మొదలుపెడతరో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X