ఊహించని హ్యాడ్సమ్ లుక్‌లో మోక్షజ్ఞ.. సంబరాలు చేసుకుంటోన్న ఫ్యాన్స్
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తమ వారసులను సినీ రంగంలోకి పరిచయం చేశారు. కానీ, ఇంకొందరు మాత్రం ఇంకా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు.
ఈ బడా హీరో తన కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేయడానికి ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పటి వరకూ ఈ కుర్రాడిని తెరపైకి తీసుకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నందమూరి మోక్షజ్ఞ హ్యాండ్సమ్ లుక్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై మీరే లుక్కేయండి మరి!

ప్రకటించిన బాలకృష్ణ
నందమూరి తారక రామారావు తర్వాత ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంఛ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కుర్రాడి రాక ఫ్యాన్స్ అంతా కోరికతో ఎదురు చూస్తున్నారు.
ఫిజిక్ చూసి నిరాశగానే
కొన్నేళ్ల క్రితమే నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలు అవి. వీటిలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అవి చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీని తర్వాత కూడా అతడు అదే ఫిజిక్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

బాలయ్య ప్లాన్స్ వేరేలా
నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ ఎంతో కసిగా ఉన్నారు. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా తెర ముందు జరిగితే.. తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ లుక్‌ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను, నటనలో మెళకువలకు గురువులను కూడా తీసుకొచ్చారు. అంతేకాదు, మిగిలిన విభాగాల కోసం టీమ్ సెట్ చేశారు.
ఆ దర్శకులు.. వర్క్‌లో
మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనులను బాలయ్య ఎప్పుడో మొదలు పెట్టారు. ఇందుకోసం ఆయన చాలా మంది దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపారు. అదే సమయంలో నందమూరి మోక్షజ్ఞ ప్రముఖ నటనా శిక్షకుడు (యాక్టింగ్ గురువు) సత్యానంద్‌ను ఇస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. బాలయ్య కూడా కథలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మోక్షజ్ఞ పిక్ వైరల్‌గా
నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎవరూ ఊహించని విధంగా మోక్షజ్ఞ ఫుల్ హ్యాండ్సమ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో దీన్ని తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











