Nandamuri Balakrishna పుట్టినరోజు అన్నిటికంటే స్పెషల్ ఫొటో ఇదే.. మనవళ్ళతో అదిరిపోయే స్టిల్!
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన ప్రత్యేకంగా కలిసి విష చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అనేక రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే వాటిలో మాత్రం ఆయన మనవళ్ళతో దిగిన ఒక ఫోటో ఎక్కువగా హైలెట్ అయింది అని చెప్పాలి. ఇక వారు ఇద్దరు నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు. ఇక కూతుళ్లకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె తనయుడు నారా దేవాన్ష్ గురించి అందరికి తెలిసిందే. ఇక చిన్న కుమార్తె తనయుడు బయటి ప్రపంచంలోకి పెద్దగా హైలెట్ అవ్వలేదు.

అయితే ఈ ఇద్దరూ మనవళ్లు వారి తాతకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ప్రత్యేకంగా ఎన్.బి.కె అనే టైటిల్ తో ఒక కానుక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు బాలయ్య కు సంబంధించిన ఎన్నో రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ మనవళ్ల తో దిగిన ఈ ఫోటోలు మాత్రం బాలయ్య చాలా హైలెట్గా కనిపించారు. బాలయ్య బాబు అభిమానులు ఆ ఫొటోను చూసి ఎంతగానో సంబరపడిపోతున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ శుక్రవారం రోజు 62 వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకంగా సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ కూడా వచ్చాయి. ఒక రోజు ముందుగానే 107 వ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో ఆడియన్స్ లో డోస్ మరింత పెరిగింది. అభిమానులకు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన కిక్ అయితే ఇచ్చారు అనే చెప్పాలి. ఇక అనిల్ రావిపూడి కూడా తన తదుపరి ప్రాజెక్టును బాలకృష్ణ తో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











