NBK109: బాబీ మూవీలో బాలయ్య గెటప్ లీక్.. 108 సినిమాల్లో కనిపించని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సినిమాను లైన్‌లో పెట్టుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ, కొందరు మాత్రం ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చేస్తూ దూసుకెళ్తున్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్న ఆయన.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా రివీల్ అయింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఫ్యామిలీ డ్రామాకు బాలయ్య మార్క్ యాక్షన్‌ను జోడించి రూపొందిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడుతోనే జరుగుతోంది.
క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఆయన డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బాలకృష్ణ మూడు గెటప్‌లలో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో లీక్ అయింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాబీ తెరకెక్కిస్తోన్న సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్ గెటప్‌లో కనిపిస్తాడట. అంటే వయసు పెరిగిన స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేసేలా ఉంటాడట. ఇది ఆయన గత చిత్రాల్లో ఎప్పుడూ కనిపించని విధంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ఇదిలా ఉండగా.. బాలయ్య - బాబీ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది. హీరోయిన్లపై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











