Unstoppable Talk Show.. పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు... అల్లు అరవింద్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అరుదైన పాత్రను పోషించబోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై, అలాగే ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో రాణిస్తున్న బాలకృష్ణ త్వరలోనే బుల్లితెరపై హోస్ట్‌గా మారబోతున్నారు. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ టాక్ షో కర్టన్ రైజర్ కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఆయన ప్రసంగం వివరాల్లోకి వెళితే.

పైసా వసూల్ పాటపై స్టెప్పులు

పైసా వసూల్ పాటపై స్టెప్పులు

అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రారంభ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ స్టైల్‌గా వేదిక మీదకు వచ్చారు. పైసా వసూల్ పాటపై ఆయన స్టెప్పులు వేసి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. పైసా వసూల్ పాటకు ఆయన వేసిన డ్యాన్సుకు ప్రేక్షకులు ఈల వేసి గోల చేశారు.

ఆ ఘనత తెలుగు వారికే చెందుతుంది

ఆ ఘనత తెలుగు వారికే చెందుతుంది

నేను ఏన్నో ఏళ్లుగా సాంఘీక, జానపద, కుటుంబ కథా చిత్రాల్లో నటించాను. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాలకు విజయాన్ని అందిస్తూ ప్రేక్షకులు అండదండలు అందిస్తున్నారు. విలక్షణమైన ప్రాతలను కోరుకొంటూ నన్ను పోత్సహించడం జరుగుతుంది. ఆ ఘనత తెలుగు వారికే చెందుతుంది అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఓటీటీ సంస్థలకు ధీటుగా ఆహా ఓటీటీ

అంతర్జాతీయ ఓటీటీ సంస్థలకు ధీటుగా ఆహా ఓటీటీ

ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి వాటికి ధీటుగా ఆహా యాప్‌ను ప్రారంభించి విజయం సాధించారు. ఆహా ఓటీటీ ఆయన మానస పుత్రిక. పొట్టి వాడికికి పుట్టెడు బుద్దులు అంటారు. అలాంటి ఆయన మదిలో గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆయనతో ఇంత చొరవుగా ఎందుకు మాట్లాడుతున్నానంటే.. వాళ్ల నాన్న లెజెండ్ అల్లు రామలింగయ్య గారి కుమారుడు. మా కుటుంబానికి అల్లు కుటుంబానికి గొప్ప అనుబంధం ఉంది అని బాలకృష్ణ తెలిపారు.

అల్లు రామలింగయ్యతో అనుబంధం

అల్లు రామలింగయ్యతో అనుబంధం

మా నాన్న ఎన్టీఆర్ కుటుంబంతో అల్లు రామలింగయ్యకు మంచి అనుబంధం ఉంది. ఆయనకు మా ఇంటి వంటగదిలోకి వచ్చేంత చొరవ ఉంది. బండోడికి ఏమైనా తీసుకెళ్లాలా అని అడిగే వాడు. మా అమ్మతో ఆయనకు మంచి అనుబంధం, ప్రేమానురాగాలు ఉన్నాయి. అలాంటి అనుబంధం అల్లు అరవింద్‌తో ఉంది అని బాలకృష్ణ చెప్పారు.

ప్రశాంత్ అద్భుతంగా ప్రోమో చిత్రీకరణ

అన్‌స్టాపబుల్ టాక్ షోలో నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. ఈ టాక్ షోకు ప్రశాంత్ శర్మ అద్భుతంగా ప్రోమో షూట్ చేశారు. టాక్ షో అంటే అల్లరి చిల్లరగా కామెంట్స్ చేయడమే కాదు. ఓ పాత్రలోకి ఒదిగిపోయేలా చేయడం నాకు అలవాటు. నటుడికి ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి హోస్ట్‌గా నేను వ్యవహరించబోతున్నాను అని బాలకృష్ణ అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : నామినేషన్స్, ఎలిమినేషన్స్ మొత్తం రవికి తెలుసు..! || Filmibeat Telugu
నటీనటుల నుంచి నేర్పుగా జవాబులు రాబడుతా

నటీనటుల నుంచి నేర్పుగా జవాబులు రాబడుతా


అన్‌స్టాపబుల్ టాక్ షోలో నేను యాంకర్‌గా కనిపించబోతున్నాను. ఈ షోలోకి ఎంతో మంది నటీనటులు వస్తున్నారు. వారి నుంచి నేర్పుగా జవాబులు రాబడుతాను. ప్రతీ వాడికి జీవితంలో ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు గురై లక్ష్యాలను చేరుకొంటారు. లక్ష్యాలను చేరుకొనే వ్యక్తుల భావోద్వేగాలను బయటకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. వారిని కష్టపెట్టకుండా వారికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నిస్తాను. హోస్ట్‌గా వ్యవహరించడం కూడా ప్రజాసేవ, కళాసేవ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌కు, ఆహా యూనిట్‌కు ధన్యవాదాలు అని బాలకృష్ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X