అల్లు అరవింద్ కోసం ఊహించని పని చేస్తున్న బాలయ్య.. కెరీర్లో ఇప్పటి దాకా చేయని 'రోల్'!
తెలుగు భాష మీద దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా అల్లు అరవింద్ అయితే తెలుగులో మొట్టమొదటి ఓటీటీ అంటూ ఆహా సంస్థను నెలకొల్పారు. తెలుగు నెంబర్ వన్ ఓటీటీగా మారిన ఆహా నుండి కేవలం సినిమాలే కాదు.. స్పెషల్ షోస్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సమంత అక్కినేని తో సామ్ జామ్ అనే టాక్ షో ని సక్సెస్ చేసిన ఆహా ఇప్పుడు మంచు లక్ష్మి హోస్ట్ గా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణను రంగంలోకి దింపనున్నట్టు చెబుతున్నారు. ఆయా వివరాల్లోకి వెళితే

అఖండ మాస్
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది లేదని తేలిపోయింది. ఇక దీంతో ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వరుస సినిమాలు
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉగాది కానుకగా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిందని అంటున్నారు.

అనిల్ రావిపూడితో మరో సినిమా
ఇక ఆ తరువాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చిందని దీంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ప్రచారం జరిగింది. దీనిని బాలకృష్ణ సైతం తన పుట్టినరోజున ధ్రువీకరించారు కూడా. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటన దసరా పండుగ సమయంలో రావచ్చని అంటున్నారు.

భారీ అంచనాలు
నాని టక్ జగదీష్ సినిమాని నిర్మించి రిలీజ్ చేసిన షైన్ స్క్రీన్స్ నిర్మాతలు, దసరా సమయాన బాలకృష్ణ-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ సినిమాలు అందించడంలో అందె వేసిన చేయి కావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ సహా నందమూరి అభిమానులు మంచి అంచనాలతో ఉన్నారు.

కెరీర్లో మొట్టమొదటి సారిగా
ఇక అసలు విషయానికి వస్తే తెలుగు సహా తమిళ, మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలను తెలుగులో దబ్ చేసి రిలీజ్ చేయడం మొదలు అదిరిపోయే సిరీస్, అలరించే టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న 100 శాతం తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం బాలయ్య పని చేయనున్నారు. ఈ పాపులర్ ఓటీటీ కోసం బాలయ్య ఓ స్పెషల్ టాక్ షో ప్లాన్ చేస్తోందని, ఇప్పటికే దాదాపు డీల్స్ కూడా ఫైనల్ అయ్యాయి. ఇక ఫస్ట్ టైం బాలయ్య తన కెరీర్ లో హోస్టింగ్ చెయ్యబోతున్నాడు. అల్లు అరవింద్ కోరడంతో పాటు కాన్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఓకే అన్నారని తెలుస్తోంది.
Recommended Video

ఊహించని విధంగా
అయితే ఈ షో కోసం 'ఆహా'టీం పెద్ద లిస్ట్ రెడీ చేశారు. టాలీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. బాలయ్య ఒక షో చేయడం ఆసక్తికరమైన విషయం అంటే అంతకు మించి గెస్టులను కూడా సెలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక బాలయ్య స్టైల్లో ఎనర్జిటిక్‌గా సాగే ఈ టాక్ షోకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. .


Click it and Unblock the Notifications











