Unstoppable 3 Episode: పండగ చేస్కోవడానికి రెడీ అవ్వండ్రా అబ్బాయిలు.. చిరుతో బాలయ్య కలిసొస్తే ఎట్లుంటదో తెలుసా?

నందమూరి బాలయ్య ఇటీవల కాలంలో హిట్ల మీద హిట్లు అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా తర్వాత ఆయన అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సీజన్ హిట్టు కావడంతో... మరో సీజన్ 2 తెరకెక్కించారు. ఇక సీజన్ 2 హిట్ కావడంతో... ఇప్పుడు సీజన్ 3 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సీజన్ 3కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే....

నందమూరి బాలకృష్ణ కరోనా సమయంలో అఖండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. ఇక ఆ సినిమా ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా తర్వాత బాలయ్య అన్ స్టాపబుల్ విన్ ఎన్బీకే అనే ప్రోగ్రామ్ చేశాడు. ఇక అప్పటి వరకు బాలయ్య అంటే కోపాస్తుడు, మొండి వాడు అనుకునేవారు. ఇక ఆ షో తర్వాత బాలయ్య అంటే ఏంటో అందరికి అర్థం అయింది.

Nandamuri Balakrishna Unstopple 3 First Episode With Megastar Chiranjeevi Full Details Here

అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య ఓ భోళా శంకరుడు అని అర్థం చేసుకున్నారు. ఇక ఈ సీజన్ సక్సెస్ కావడంతో.. మళ్లీ సీజన్ 2 కూడా చేశారు. ఇక సీజన్ 2 కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆయన సంక్రాంతి కానుకగా వీరసింహా రెడ్డి సినిమాను చేశాడు. ఇక ఈ సినిమా గోపి చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య సరనస శృతి హాసన్ నటించింది. ఈ సినిమా కూడా బాలయ్యకు సూపర్ హిట్ ను ఇచ్చింది.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తొలిసారిగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను దసర కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Chiranjeevi Balakrishna

ఇక ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ అన్ స్టాపబుల్ షోతో రానున్నట్లు తెలుస్తోంది. దసరా సమయంలో మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ప్రచారం జరిగిన దాని మేరకు ఆహా వర్గాలు ఈ మూడవ సీజన్ ప్లాన్ చేస్తే కనుక మొదటి ఎపిసోడ్ మెగాస్టార్ చిరంజీవితో చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు మొదటి ఎపిసోడ్ షూటింగ్ కి ప్లాన్ చేశారని సమాచారం.

నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ -చిరంజీవి మధ్య పోటీ ఎక్కువగా ఉండేదని తెలిసిందే. ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేయడమే కాదు వారి అభిమానులు సైతం ఎప్పటికప్పుడు మా హీరో గొప్ప అంటూ కామెంట్ల యుద్ధం చేసుకుంటు ఉంటారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా ఈ ప్రోగ్రాం చేయబోతున్నారనే వార్తతో ఇరు అభిమానులు ఖుషి అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X