పవన్ కళ్యాణ్ తో బాలయ్య బాక్సాఫీస్ ఫైట్.. ఆ ఫెస్టివల్ కు ఫిక్స్ అయ్యేలా ప్లాన్!
మెగా నందమూరి హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడితే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ డిఫరెంట్ మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. ఇక ఇద్దరు కూడా ఊహించని స్థాయిలోనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నారు. ఇక ఫైనల్ గా అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా మొత్తం సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక పెట్టిన పెట్టుబడికి మాత్రం నందమూరి బాలకృష్ణ తన స్టార్ ఇమేజ్ తో వీర సింహారెడ్డికి మంచి కలెక్షన్స్ అందించాడు. ఈ సినిమా కంటెంట్ అంతగా వర్కౌట్ కాలేదు కానీ బాలయ్య నటన మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వచ్చేలా చేసింది. అయితే నందమూరి బాలకృష్ణ మరో బిగ్ ఫెస్టివల్ కు మరో మెగా హీరోతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ళు పైబడిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాది దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.
అయితే అదే సమయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో సినిమాను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్.రత్నం నిర్మిస్తున్న ఆ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరపైకి రానుంది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈసారి దసరా సమయానికి హరిహర వీరమల్లును గ్రాండ్ గా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి అదే సమయానికి బాలయ్య వస్తాడా లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడా అనే సందేహానికి కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











