NBK 109: ఆ మాస్ దర్శకుడికి ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ స్థానంలో అదిరిపోయే కాంబో?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పటిలానే స్పీడ్ పెంచారు. ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని ఇదివరకే చాలాసార్లు రుజువయింది. ఒక ప్లాప్ అందుకున్న కూడా వెంటనే మళ్ళీ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంటూ వస్తున్నారు. అఖండ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో బాలకృష్ణ చేసిన వీర సింహారెడ్డి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

టాక్ ఎలా ఉన్నా కూడా బాలయ్య తన స్టార్ స్టామినాతోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసినందుకు మరికొంతమంది మాస్ కమర్షియల్ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక బాలకృష్ణ కూడా కొత్తవారు అయినా సరే కథలు వినడానికి వెనుకడుగు వేయడం లేదు. కథ నచ్చితే వారికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 NBK 109:

అలాగే 109, 110 ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. చాలామంది దర్శకులు బాలయ్యతో వీలైనంత తొందరగా కొత్త ప్రాజెక్టులను ఫైనల్ చేసుకోవాలి అని చూస్తున్నారు. అసలైతే బాలయ్య 109వ ప్రాజెక్టును బాబీ దర్శకత్వంలో చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపించింది. నిజానికి బాబి కూడా బాలయ్య బాబు కోసం ఒక నాలుగు కథలను కూడా వినిపించారట.

అయితే ఇప్పుడు మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు విషయంలో బాలయ్య దర్శకుడికి ట్రస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేసి ఆ తర్వాత నీతో మరొక సినిమా చేస్తానని బాబీ కి మాట ఇచ్చినట్లు సమాచారం. అందుకు దర్శకుడు బాబి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ లోపు ఈ దర్శకుడు మరో హీరోతో వర్క్ చేసే అవకాశం ఉంది. ఇక త్వరలోనే బాలకృష్ణ బోయపాటికి సంబంధించిన మరో ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X