NBK109: బాలయ్య కోసం పోటీ పడుతున్న హిట్ దర్శకులు.. సరికొత్త కాంబినేషన్స్!

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 62 ఏళ్ల వయసులోనూ అధ్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అందరి చేత ఆహా అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాల్లో నటిస్తూ... అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లనే రాబట్టారు.

అయితే ఇటీవలే వీర సింహారెడ్డి చిత్రంతోనూ అదరగొట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టగా అదే ఊపుతో మరో సినిమాకు ఓకే చెప్పారు. వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ కూడా అతి వేగంగా జరుపుకుంటోంది. ఇది బాలకృష్ణ కు 108వ చిత్రం. అందుకే ఈ చిత్రానికి ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్ లో పెడుతున్నారు నటసింహం.

Nandamuri balakrishna upcoming projects with talented directors

అయితే నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఓ ముగ్గురు డైరెక్టర్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారట. వాళ్లలో సింహ, లెజెండ్, అఖండ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. అయితే ఈయన ఇప్పటికే బాలయ్య బాబుకు కథ చెప్పడం అందుకు ఆయన కూడా ఓకే చెప్పడం జరిగాయట. కానీ ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియదు. బోయపాటి శ్రీనుతో రాబోయే చిత్రం NBK109 లేదా NBK110 అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

అలాగే ఇటీవలే బలగం సినిమాతో తెలంగాణ సంప్రదాయాన్ని, పద్ధతులను కళ్లకు కట్టినట్లు చూపించిన వేణు యెల్దండి కూడా బాలకృష్ణ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరోవైపు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవలే వచ్చిన విరూపాక్ష చిత్రం డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కూడా బాలయ్య బాబుతో సినిమా చేయాలని చూస్తున్నారట. ఈ నూతన డైరెక్టర్లు ఇద్దరూ విడి విడిగా బాలకృష్ణ కు కథలు చెప్పారట.

Nandamuri balakrishna upcoming projects with talented directors

ఈ కథలు కూడా ఆయనకు నచ్చాయని సమాచారం. ఈ ముగ్గురు డైరెక్టర్లలో బాలయ్య బాబు ఎవరిని సెలెక్ట్ చేసుకొని తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తారో చూడాలి. ఇప్పటికే మూడు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి చిత్రం ముందుకు సాగుతుందా లేదా నూతన డైరెక్టర్లతో కలిసి బాలకృష్ణ అడుగు ముందుకు వేయబోతున్నారా అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఏం జరగనుందో. ఎవరికి బాలయ్య బాబును డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X