F3 సినిమా చూసిన తరువాత దర్శకుడికి ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. మొత్తం రివర్స్ అయ్యిందిగా..

నందమూరి బాలకృష్ణ 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ స్థాయి ఏ లెవెల్ కు వరకు పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన రేంజ్ తగ్గట్టుగానే దర్శకుడు అనిల్ పర్ఫెక్ట్ మాస్ కథను సిద్ధం చేస్తున్నట్లు కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా F3 మూవీ చూసిన బాలయ్య బాబు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ..

కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ..

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మూడవ సినిమా అఖండ సినిమా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా మాస్ యాక్షన్ సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుసగా రెండు విభిన్నమైన యాక్షన్ సినిమాలతో బాలయ్య బాబు తనను తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాడు.

 బాలయ్య బాబు తండ్రిగా..

బాలయ్య బాబు తండ్రిగా..

ఇక 108వ సినిమాలో బాలయ్య బాబును 45 వయసుతో ఉన్న పవర్ఫుల్ హీరోగా ఒక అమ్మాయికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా అనిల్ రావిపూడి ఇదివరకే తెలియజేశాడు. ఆ సినిమాలో ఒక వైపు పవర్ఫుల్ గా కనిపిస్తూనే మరొకవైపు మంచి ఎమోషనల్ క్యారెక్టర్ తో బాలయ్య బాబును ప్రజెంట్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురరిగా శ్రీలీల నటించబోతోంది.

F3 చూసిన తరువాత

F3 చూసిన తరువాత

అయితే రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన F3 సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన నందమూరి బాలకృష్ణ దర్శకుడికి నిర్మాతలకు కూడా స్పెషల్ విషెస్ అందించాడు. అయితే అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా విషయంలో కూడా బాలయ్య బాబు మరో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఈ సినిమా చూసిన తర్వాతే ఆయన మరొక ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 కామెడీ కావాలని..

కామెడీ కావాలని..

F3 సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ రైటింగ్ అద్భుతంగా ఉంది అని తదుపరి సినిమా విషయంలో కూడా అదే తరహాలో బలమైన కామెడీ సీన్లు యందాలనే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని బాలయ్య సలహా ఇచ్చారట. బాలయ్య బాబు కూడా కామెడీ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. అఖండ, అలాగే 107వ ప్రాజెక్ట్ రెండు కూడా మాస్ యాక్షన్ సినిమాలు కావడంతో తదుపరి సినిమాలో కొంత కామెడీ టచ్ కూడా ఉంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట.

కండిషన్ పెట్టడంతో..

కండిషన్ పెట్టడంతో..

అనిల్ రావిపూడి మాత్రం ఎక్కువగా తనకు కామెడీ
దర్శకుడిగా టాక్ పడడంతో విభిన్నమైన తరహాలో కూడా సినిమాలు చేయాలని బాలయ్యను బాబు పవర్ఫుల్ పాత్రలో చూపించాలని అనుకున్నాడు. కానీ హఠాత్తుగా హీరో అలాంటి కండిషన్లు పెట్టడంతో ఇప్పుడు స్క్రిప్ట్ చేంజ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు. తీసుకురావాలనుకుంటున్నారు. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X