చిటికేస్తే ఖతం.. మూడో కన్ను తెరిచానంటే.. జాగ్రత్త.. వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ వార్నింగ్

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర పదజాలంలో వైసీపీ నేతకు వార్నింగ్ ఇస్తూ.. ఫ్యాన్స్ చూసుకోమంటూ సైగ చేశారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు


స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణంలో పాతాళ భైరవి సినిమాను ఉచితంగా అభిమానులకు ప్రదర్శించారు. ఈ వేడుకలో మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి, ప్రముఖ నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి ఆహ్వానించి సన్మానం చేశారు. సావిత్రి, నాగిరెడ్డి సినిమా పరిశ్రమకు చేసిన సేవలను బాలకృష్ణ కొనియాడారు.

నాన్న గారు కారణజన్ముడు

నాన్న గారు కారణజన్ముడు

మా నాన్న గారు, గురువు కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు రావడం రెండోసారి. రెండోసారి రావడానికి కారణం.. పాతాళబైరవి సినిమా రిలీజైన రోజు ఇది. ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్న సినిమాను అభిమానుల చూసేందుకు వచ్చాను అని బాలకృష్ణ అన్నారు.

మరణం అనివార్యం అంటూ

మరణం అనివార్యం అంటూ

సినిమా రంగంలో విశేష కృషి చేశారు. కష్టపడి మహానటులుగా మారిపోయారు. కారణజన్ములుగా నిలిచారు. కాలగర్భంలో మరణం అనివార్యం. కానీ శాశ్వతంగా మన మనసుల్లో చెరగని ముద్రవేశారు. రామారావు సినిమా రంగానికి పరిమితి కాలేదు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు అని బాలకృష్ణ అన్నారు.

నా ఆలోచనలే పాఠం

నా ఆలోచనలే పాఠం

నాన్నగారు పాతాళ భైరవి, ఎన్నో మధురమైన చిత్రాలు చేశారు. నేను సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, భైరవద్వీపం చిత్రాలు చేశాను. వాటిని ప్రేక్షకుల ఆదరించారు. నా ఆవేశమే నాకు బలం, నా నమ్మకం, నా ఆలోచనలు పాఠం. బాలకృష్ణ అంటే ఎన్నో అంశాల కలయిక. ఇప్పటికీ నేను నా నిర్మాతలు, యాక్టర్లతో టచ్‌లో ఉంటాను అని బాలకృష్ణ తెలిపారు.

తెనాలిలో నాకు, నాన్నగారికి ఫ్యాన్స్

తెనాలిలో నాకు, నాన్నగారికి ఫ్యాన్స్

తెనాలిలో ఎన్టీఆర్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. నాకు అంత మంది అభిమానులు ఉన్నారు. పండితులు, పెద్దలు నేను మాట్లాడే మాటలను వింటున్నారు. మన పిల్లలకు భాష గురించి తెలియదు. అందుకే నేను సంస్కృతం మాట్లాడుతుంటాను. మన పిల్లలు విని నేర్చుకొంటారనేది నా అభిప్రాయం అని బాలకృష్ణ చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పదంగా

వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పదంగా

వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పదంగా
ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సన్మాన వేడుకలో బాలకృష్ణ పాటలు వేయగా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనేది సమాచారం. అయితే తన పాటలను ఆపివేయాలని తన అభిమానులను కంట్రోల్ చేయడంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నర్సారావుపేటలో నా పాటలు వేస్తుంటే ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారట. ఆయన మంచివాడే కానీ.. దిగజారాడు. ఆయన తప్పు కాదు.. యధా రాజా తథా ప్రజా. అందరు నా సినిమాలే కాదు.. అందరి హీరోల సినిమాలు చూస్తారు అని బాలకృష్ణ ఎద్దేవా చేశాడు.

నీ పరిధిలో ఉండు.. జాగ్రత్త అంటూ వార్నింగ్

తన పాటలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు. మీ పరిధిలో మీరు ఉండండి. నా సినిమాలు అన్ని కులాల వారు చూస్తారు. నా పాటలను అందరు వింటారు. ఎవరివల్ల జరిగిందో వారికి నేరుగా హెచ్చరిస్తున్నాను. నేను చిటికేస్తే చాలూ.. ఫ్యాన్స్ చూసుకోండి. పెద్ద చదువు చదివావు. రాజకీయాల్లోకి వచ్చావు. ప్రజా సేవ చేసుకో. మూడో కన్ను తెరిచానంటే అంతే అని బాలకృష్ణ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X