Nandamuri Balakrishna:‘దవడ సెట్ చేసేస్తా కొడకా’: బాలయ్య మాస్ వార్నింగ్
నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియర్ ఎన్టీఆర్ నట వారసుడుగా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు డిపరెట్ సోర్టీలు సెలక్ట్ చేసుకుంటూ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. తన 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో హిట్స్ అందుకున్నారు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ఇక బాలయ్య సినిమా రిలీజ్ అంటే మాములుగా ఉండదు. థియేటర్ల ముందు జాతర జరిగినట్టే అనిపిస్తుంది. ఇక డైహార్ట్ ఫ్యాన్స్ హంగామా మామూలు గా ఉండదు. భారీ కట్ అవుట్స్ పెట్టి పూజలు చేస్తారు. అవసరమైతే జంతు బలి చేసి పండుగ చేసేస్తారు. సినిమాలో బాలయ్య యాక్షన్ కంటే.. ఫ్యాన్స్ రియాక్షనే ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్,ఫైట్స్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన డైలాగ్ అంటే వింటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి.

ఇక యాక్షన్ సీన్స్ గురించి చెప్పాలంటే.. మాటలు చాలవు. ఫ్యాన్స్ డిమాండ్ ను బట్టి వాటి లెవల్ పెంచేస్తారు బాలయ్య. అలాగే బాలయ్య సినిమా రిలీజ్ అంటే బాక్సాఫీస్ కూడా షేక్ కావాల్సిందే. గత రికార్డులు బ్రేక్ కావాల్సిందే. ఇక బాలయ్య వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.. టాలీవుడ్ లో ఉన్నా హీరోలందర కంటే బాలయ్య డిఫరెంట్. ఎందుకంటే.. ఆయన ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మనస్సులో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. ఓపెన్ గా మాట్లాడుతారు.
ఆయనకు ప్రేమ వచ్చినా.. కోపం వచ్చినా వెంటనే చూపిస్తాడు. వెంటనే అనేస్తాడు. అవసరమైతే అవతలి వ్యక్తిపై చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడడు అని టాక్. ఇక అభిమానులు విషయంలో కూడా అంతే..అభిమానమైనా, ఆవేశమైనా ఉన్నది ఉన్నట్లు చెప్పేసే భోళా మనిషి బాలయ్య. అభిమానులు కూడా బాలయ్య కొట్టినా, తిట్టినా మా బాలయ్యే అంటూ మురిసిపోతుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఓ ఓల్డ్ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
బాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగు ఇలా దర్శకుడు లేదు. అలాంటి దర్శకులు లేకపోవడం మన దురద్రుష్టకరం అంటూ కొందరూ మాట్లాడుతుంటే.. వారి నేను వార్నింగ్ ఇచ్చా.. పళ్లు రాలుతాయి. మాట్లాడే ముందు వాళ్లు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకొని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారికి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్ర తెలియదు. ఇది విత్తనం మొలకగా మారి మహావ్రుక్షగా మారింది. నేను తీసిన ఆదిత్య 369 లేదా భైరవ ద్వీపం ఇండస్ట్రీని షేక్ చేశాయి. మనకు లేరా దర్శకులు మనకు లేరా ప్రొడ్యూసర్లు, సాంకేతిక నిపుణులు, నటులు లేరా' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్యా... బాలయ్య తో పెట్టుకుంటే.. మామూలుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











