Nandamuri Mokshagna: ఫస్ట్ మూవీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?

Nandamuri Mokshagna remuneration: నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కీలక ప్రకటన వచ్చింది. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కోట్లాది మంది జనాలు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ బర్త్డే సందర్బంగా ఈ ప్రకటన చేశారు. ఆయన ఫస్ట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ .. మోక్షజ్ఞ మొదటి సినిమాను రూపొందించనున్నారు. సుధాకర్ చెరుకూర తన ఎస్వీఎల్ మూవీపై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ప్రొడ్యూసర్ గా
వ్యవహరించబోతున్నారు.

మోక్షజ్ఞ బర్త్ డే (సెప్టెంబరు 6)సందర్భంగా ఓ అదిరిపోయే లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో మోక్షజ్ఞ సూపర్ లుక్, ఆకట్టుకునే చిరునవ్వు, మెస్మరైజింగ్ గా కనిపిస్తున్నారు.ఈ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో మోక్షజ్ఞ చాలా స్మార్ట్‌గా ఉన్నాడు. అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపిస్తున్నారు.ఈ పోస్టరును చూస్తే.. లవ్ అండ్ యాక్షన్ బేస్ గా స్టోరీ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే.. చిన్న బాలయ్య మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Nandamuri Balakrishna s son Mokshagna remuneration news is going viral on social media

మోక్షజ్ఞ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నందమూరి హీరో మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే చాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమని చెప్పుకోవచ్చని అన్నారు. చాలా గౌరవంగా అనిపిస్తోందని తెలిపారు. ఇది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వెల్లడించారు. ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో ట్రైనింగ్ చేస్తున్నారని, ఇందులోని డ్యాన్స్, ఫైట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటున్నారని డైరెక్టర్ వెల్లడించారు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే మూవీ అవుతుందని తెలిపారు. గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రముఖ హీరో బాలయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారుదర్శకుడు ప్రశాంత్ వర్మ.

నందమూరి హీరో సిని ఎంట్రీ ఇవ్వడంతో చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. తాత నందమూరి తారక రామారావులా , తండ్రి బాలయ్య లాగా సినీ ఇండస్ట్రీలో రాణించి, ఎనలేని కీర్తి సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. అలాగే జీవితంలో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. నందమూరి నట వారసుడిగా వారి ప్రతిష్టలు మరింత ఇనుమడింప చేసేలా నీ సినీ ప్రస్థానం విజయవంతంగా వెలుగొందాలని మోక్షజ్ఙకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించారు. 'మీరు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు.నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత నందమూరితో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఆశీర్వాదాలలు కురవాలి. జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ ' అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

Nandamuri Balakrishna s son Mokshagna remuneration news is going viral on social media

ఇదిలాఉంటే.. ఇకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం నందమూరి హీరో ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. ఈ వార్త విన్న నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇది షాకింగ్ రెమ్యూనేషనే అని చెప్పాలి. బాలకృష్ణ తన 50 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకూ కూడా ఇలాంటి రెమ్యూరేషన్ తీసుకోలేదంట. బాలక్రుష్ణ రెమ్యూనరేషన్ ఇంకా రూ.15 కోట్లు మించలేదని టాక్. అలాంటిది మోక్షజ్ఞ తన తొలి సినిమాకే ఈరేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింటే. ఏది ఏమైనా తొలి సినిమాతోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం కాదు.. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్స్ ను మెప్పిస్తారో వేచి చూడాలి. అలాగే..బాలయ్య నట వారసత్వాన్ని కంటీన్యూ చేస్తారో లేదో వేచి చూడాలి మరీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X