Nandamuri ఫ్యామిలీ నుంచి సరికొత్తగా రాబోతున్న మరో హీరో.. హాలీవుడ్ టైటిల్‌తో పోస్టర్ రోలీజ్!
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన మూడవ జనరేషన్ లో అందరూ అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. చాలా వరకు అందరూ వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల్లోకి వస్తే మాత్రం బాలకృష్ణ ఎదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నందమూరి ఫ్యామిలి నుంచి
నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చిన హీరోలు అందరు అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. బాలకృష్ణ స్టార్ హోదాను అందుకోగా ఆ తరువాత కళ్యాణ్ రామ్ కూడా బాగానే ప్రయోగాలు చేసినప్పటికీ ఇంకా ఒక నిలకడగా ఉండే మార్కెట్ ను సంపాదించలేదు. ఇక తారకరత్న నటుడిగా పరవాలేదు అనిపించగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ క్లిక్ అయ్యాడు.

నందమూరి చైతన్య కృష్ణ
అయితే మూడవ జనరేషన్ లో మరో నందమూరి హీరో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన ఎవరో కాదు నందమూరి తారక రామా రావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. వాస్తవానికి ఆయన ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. కానీ 2003 వ సంవత్సరంలోనే ఆయన ధమ్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

మొదట ఆ సినిమా
మొదట దమ్ అనే సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అసలు ఆయన సినిమా చేశాడు అనే విషయం కూడా ఇప్పటివరకు తెలియదు. దీంతో ప్రస్తుతం ఆయన మళ్ళీ డిఫరెంట్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు అన్నట్లుగా హడావిడి చేస్తూ ఒక సినిమా అయితే రూపొందుతోంది. వంశీకృష్ణ అఖిల దర్శకత్వంలో నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పుడు మరో సినిమా
స్వయంగా ఆయన తండ్రి నందమూరి జయకృష్ణ బసవతారకం ప్రొడక్షన్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చైతన్య కృష్ణ సోదరుడు కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు. బ్రీత్ అంతిమ పోరాటం అనే పేరుతో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది.

అటెన్షన్ కోసం
హాలీవుడ్ మూవీ లాంటి టైటిల్ తో పోస్టర్ లో చైతన్య ఇయర్ బర్డ్స్ పెట్టుకొని వర్షంలో గొడుగు పట్టుకొని నిలబడి సీరియస్ గా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాఫ్ చేసేలా కనిపిస్తోంది. వంశీకృష్ణ అఖిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ రాబిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఈసారైనా సక్సెస్ అవుతాడా?
బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు... మిగతా నటి నటులు ఎవరున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెబుతూ సినిమా యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. మొదటి సినిమా కలిసి రాలేదు కాబట్టి రెండో సినిమా మీద చాలా శ్రద్ధ పెట్టి మరీ సినిమా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఎంత వరకు అది సక్సెస్ అవుతుందో.


Click it and Unblock the Notifications











