NKR 21: కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ.. నెవ్వర్ బిఫోర్ అనేలా క్రేజీ ప్రాజెక్ట్!
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఎల్లప్పుడూ ముందుంటాడు. గత ఏడాది బింబిసార సినిమాతో కొత్త దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి తీసుకువచ్చి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన విడుదలైంది. ఇది అతని కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ మూవీగా ఉండబోతోందట.
బింబిసార సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అంతకుమించి అనేలా మరొక సరికొత్త సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తప్పకుండా హీరోకు ఒక బెస్ర్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. "అలా ఎలా" అనే రొమాంటిక్ కామెడీ సినిమాను నిర్మించిన అశోక క్రియేషన్స్, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తోంది.

ఇక హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటెన్స్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పిడికిలి బిగించిన హీరో చేతికి రక్తం మరకలు ఉన్నాయి. చూస్తుంటే హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. హై టెక్నీకాల్ వాల్యూస్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ రాబోయే చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరపైకి రానుందట. ఇక స్టార్ క్యాస్ట్ తో పాటు ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నారు. ప్రదీప్ చిలుకూరి మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ అవతార్‌లో కళ్యాణ్ రామ్‌ని ప్రదర్శించే ఆకర్షణీయమైన కథను రాశారని తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ గత చిత్రం "డెవిల్" తర్వాత ఈ చిత్రం తదుపరి ప్రాజెక్ట్ గా రానుంది.
హరికృష్ణ భండారిని స్క్రీన్‌ప్లే రచయితగా వర్క్ చేస్తుండగా నటీనటులు మరియు సాంకేతిక సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ ఎక్సలెన్స్ పరంగా కొత్త స్టాండర్డ్‌లను సెట్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ భారీ అంచనాల యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల కోసం అభిమానులు, సినీ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











