twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్.. అప్పుడు బయటకు వెళ్లిపోతాను అంటూ..

    |

    నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బెంబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే పెరుగుతున్నాయి. ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా బింబిసార ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ కూడా పెంచుతున్నారు. అయితే కళ్యాణ్ రామ్ తన ఇంటర్వ్యూలలో ఇటీవల రాజకీయ అంశాలపై కూడా వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ పై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే..

    అప్పట్లో బిజీగా

    అప్పట్లో బిజీగా

    నందమూరి హీరోలు రాజకీయాల్లో అప్పట్లో కాస్త బిజీగానే కనిపించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారాలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ కొంతకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నికలపై ఎ విధమైన వివరణ కూడా ఇచ్చింది లేదు. నందమూరి వారిలో తెలుగుదేశం నాయకత్వంపై అసంతృప్తిగానే ఉన్నట్లు అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి.

     ఎన్టీఆర్ కామెంట్

    ఎన్టీఆర్ కామెంట్

    అయితే గతంలోనే జూనియర్ ఎన్టీఆర్ అయితే కొన్నిసార్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే తన ఫోకస్ మొత్తం కూడా సినిమాలపైనే ఉంది అని రాజకీయాలలో చాలా అనుభవం అవగాహన అవసరం అని ప్రస్తుతానికైతే ఇంకా అంతవరకు తాను రాలేదు అని కానీ భవిష్యత్తులో మన జీవితం ఎలా ముందుకు వెళుతుంది అని ఊహించలేము అని కూడా పరోక్షంగా ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తి ఉంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

    కళ్యాణ్ రామ్ క్లారిటీ

    కళ్యాణ్ రామ్ క్లారిటీ

    ఇక రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ పై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన ఆలోచన అటువైపుగా ఏమాత్రం లేదు అని చెప్పాడు. ప్రస్తుతం నేను యాక్టింగ్ లోనే ఉన్నాను అంటూ రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడూ కూడా చేయకూడదు అని అసలు నాకైతే అలాంటి రెండు విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్లే ఆసక్తి లేదు అని చెప్పాడు.

    పాలిటిక్స్ అవసరం అయితే..

    పాలిటిక్స్ అవసరం అయితే..

    ప్రస్తుతం నేను నటన మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. మిగతా ఏ విషయాలపై కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు ఒకవేళ పాలిటిక్స్ అవసరం అనుకున్నప్పుడు ఒక్కసారిగా నా సినిమాలు నా జీవితంలో నుంచి బయటకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం అయితే నాకు పెద్దగా రాజకీయాలపై క్లారిటీ అయితే లేదు. అసలు భవిష్యత్తులో అక్కడ వరకు వెళ్తానా లేదా అనేది కూడా తెలియదు అని కళ్యాణ్ రామ్ చాలా బ్యాలెన్స్ తో తన నిర్ణయాన్ని అయితే తెలియజేశారు. మరి తెలుగు దేశం పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో నందమూరి హీరోలు ఎంతవరకు మద్దతు ఇస్తారో చూడాలి.

    English summary
    nandamuri kalyan ram about political entry in future
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X