Devil Trailer Review: బాలయ్యకే ఎసరు పెట్టిన నందమూరి కల్యాణ్... వారసుడు అనిపించుకోవడానికేనా?

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోస్ వచ్చారు. అందులో కల్యాణ్ రామ్ ఒకరు. బింబిసారి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో... తాజాగా పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకోగా... అందులోని ఓ డైలాగ్ వింటుంటే.. నందమూరి బాలయ్యకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. వారసుడు అనిపించుకోవడానికి కల్యాణ్ రామ్ ఆ పదాన్ని వాడాడా అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్'. ఇక ఈ సినిమా పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ జోనర్ లో తెరకెక్కుతుంది. తనకు బింబిసార వంటి సూపర్ సక్సెస్ ఇచ్చిన ఆ హీరోయిన్ నే కల్యాణ్ రామ్ నమ్ముకున్నాడు. ఇక డెవిల్ సినిమాలో కూడా కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

Nandamuri Kalyan Ram Devil Movie Trailer Released and Kalyan Ram took Balayya Lion tag Full Details Here

ఇక ఈ డెవిల్ సినిమాకు అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 29న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కానుంది. ఇది కల్యాణ్ రామ్ మొదటి పాన్ ఇండియా సినిమా. ఇక ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ట్రైలర్ ప్రారంభం కాగానే... ఒక రాజకుటుంబానికి సంబంధించిన అమ్మాయి హత్య జరుగుతుంది. దానిని పరిశోదించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్ ఏజెంట్ అయిన డెవిల్ హీరోను పంపిస్తుంది. అయితే అక్కడికి డెవిల్ ని తీసుకు రావడానికి మరో కారణం టైగర్ హంట్ పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్. దీన్ని డెవిల్ చేత బ్రిటిష్ ఆఫీసర్స్ ప్లాన్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ. ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం కొత్తగా అనిపిస్తున్నాయి.

Nandamuri Kalyan Ram Devil Movie Trailer Released and Kalyan Ram took Balayya Lion tag Full Details Here

బ్రిటిష్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కాస్ట్యూమ్ లో భార‌తీయ‌త చూపిస్తూ సినిమాలో కళ్యాణ్ రామ్ తో దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారని ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లో విశ్వాసం చూపించడానికి.. విధేయతతో ఉండడానికి కుక్కననుకున్నావా.. లయన్ అనే డైలాగ్ చెప్తాడు. ఇక ఈ డైలాగ్ చెప్పడంతో మరో విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

లయన్ అంటే మనకు గుర్తుకు వచ్చేది బాలయ్య. బాలయ్యకు నటసింహం, లయన్ వంటి బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు నేను లయన్ అంటూ కల్యాణ్ రామ్ చెప్పుకురావడం హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య ట్యాగ్ ను కల్యాణ్ రామ్ తీసుకుబోతున్నాడా ఏంటి అంటూ బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక లయన్ కల్యాణ్ రామ్ అని పిలువాల్సి వస్తుందేమో అని అంటున్నారు. ఇక వారసుడు అనిపించుకోవడానికేనా ఇలా అని కామెంట్స్ పెడుతున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X