Devil మల్టీ గెటప్స్‌తో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ ఏజెంట్ డెవిల్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా రూపొందించిన పిరియాడిక్ సినిమా డెవిల్ రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎక్సైటింగ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్ని. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే..

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ పాత్రలో కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ డెవిల్‌పై అంచనాలు పెంచాయి.

Nandamuri Kalyan Rams Devil set to release worldwide on this day

డెవిల్ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ విభిన్నమైన గెటప్స్‌తో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యాడు. పోస్టు ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్ పనులను పూర్తి చేసుకొంటున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో మరింత బిజీగా మారింది.

డెవిల్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అభిషేక్ అగర్వాల్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గాంధీ నడికుడికర్ సహాయంతో సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా చేస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కథను అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అభిషేక్ నామా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X