Just In
- 3 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 4 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 4 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 4 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం: ఊహించని పాత్రలు చేయనున్న స్టార్
నందమూరి కుటుంబం నుంచి పలువురు వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ఒకడు. 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'అతనొక్కడే'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే 'పటాస్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ నందమూరి హీరో.. అప్పటి నుంచి వైవిధ్యమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ కొత్త సినిమాను మొదలు పెట్టాడు.
రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో నందమూరి కల్యాణ్ రామ్ ఓ సినిమాను చేయనున్నాడు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ప్రొడక్షన్ నెంబర్ 14గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యాడు. ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట

ఇక, కొద్ది రోజులుగా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోన్న కల్యాన్ రామ్.. ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే, ఇది పిరియాడిక్ జోనర్లో రూపొందనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, టైమ్ మెషీన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.