‘రా’ ఏజెంట్‌గా మారిన కల్యాణ్ రామ్: ఆ సినిమా కోసం నందమూరి హీరో సాహసాలు
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రేక్షకుల ఆదరణను అందుకుని స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో కొన్ని మాత్రమే హిట్లను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాత్మక చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
కల్యాణ్ రామ్ ప్రస్తుతం రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడట. అంతేకాదు, ఈ పాత్ర కోసం అతడు ఇప్పటి వరకు ఎవరూ చేయని సరికొత్త సాహసాలు కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది. అలాగే, ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఈ నందమూరి హీరో ఊహించని గెటప్‌తో దర్శనమివ్వబోతున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితమే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో జరిగాయి. ప్రొడక్షన్ నెంబర్ 14గా దీన్ని లాంచ్ చేశారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











