twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తమ్ముడు నమ్మాడు, లేకపోతే బాధపడేవాన్ని: కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్

    |

    నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుద‌ల‌ై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

    సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

    అలా జరిగితే చాలా బాధ పడేవాన్నేమో?

    అలా జరిగితే చాలా బాధ పడేవాన్నేమో?

    118 విజయంతో నా జీవితాంతం రుణపడిపోయే ఫీలింగ్ కలిగించారు. మీరు ఈ సినిమాను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే నేను చాలా బాధపడేవాన్నేమో? ఒక చిన్న గట్ ఫీలింగ్ వచ్చింది. ప్రేక్షకులకు కొత్తగా ఏమైనా ఇస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు.. వారి గుండెల్లో పెట్టుకుంటారనే ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. సినిమాను హిట్ చేసిన అందరికీ చాలా థాంక్స్. ఇలాంటి కొత్త కాన్సెప్టులను మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు.

    నాలో ఏం చూశారో..?

    నాలో ఏం చూశారో..?

    గుహన్ గారు నాలో ఏం చూశారో తెలియదు. నేను ఈ సినిమా చేస్తే బావుంటుందని నమ్మారు. ఆయనే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. ఆయనలేకుండా ఈ సినిమా లేదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

    ఆ సినిమా ప్లాప్ అయినపుడు...

    ఆ సినిమా ప్లాప్ అయినపుడు...

    నిర్మాత మహేష్ కోనేరు మొహంలో ఇపుడు నవ్వుచూస్తున్నాను. ‘నా నువ్వే' సమయంలో ఆ మనిషి ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నేను కూడా బాధ పడ్డాను. చాలా రోజులు నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఇలా అయింది.. మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందని ఫీలయ్యేవాడు. చాలా సార్లు నా వద్ద బాధపడ్డాడు. మన చేతిలో ఏమీ ఉండదని చెప్పాను. మనం కొత్తగా ట్రై చేశాం. కొన్సిసార్లు అవి వర్కౌట్ కావు. 118 వర్కౌట్ అవుతుందనే నమ్మకం పెట్టుకోండి అని చెప్పాను. ప్రేక్షకులు మా నమ్మకాన్ని నిజం చేశారని కళ్యాణ్ రామ్ తెలిపారు.

    నా తమ్ముడు తారక్ నమ్మాడు..

    నా తమ్ముడు తారక్ నమ్మాడు..

    నా తమ్ముడు తారక్ ఎవరూ చూడక ముందు ఈ సినిమా చూశారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పాడు. అతడి నమ్మకం నిజమైంది. మా మీద నమ్మకంతో సినిమాను కొన్న దిల్ రాజు గారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు.

    English summary
    118 Movie Success Celebrations at Hyderabad. Kalyan Ram, Nivetha Thomas, KV Guhan, Mahesh S Koneru, Shekar Chandra, Mirchi Kiran, Giri, Kalyan at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X