మహేశ్, బన్నీ ఉన్నా తగ్గేదే లేదంటున్న నందమూరి హీరో

అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'పటాస్'తో ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన చేసిన పలు చిత్రాలు కూడా ప్రేక్షకాదర పొందాయి. ఇక, ఇటీవల వచ్చిన '118'తో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు కల్యాణ్ రామ్. దీని తర్వాత అతడు చేస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దీన్ని తెరకెక్కించనున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అదే సమయంలో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' కాగా, అల్లు అర్జున్ సినిమా 'అల.. వైకుంఠపురములో' మరొకటి. రెండు బడా సినిమాలు ఉన్నా కల్యాణ్ రామ్ మాత్రం అస్సలు తగ్గనంటున్నాడట. అందుకే ఈ సినిమా సంక్రాంతికే తీసుకు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Nandamuri Kalyan Ram Speed up For Entha Manchivadavura

మహేశ్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది.

'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు. ఈ సినిమా కూడా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X