Mokshagna Teja: బరువు తగ్గిన బాలయ్య వారసుడు.. లేటెస్ట్ అల్ట్రా లుక్ వైరల్!

నందమూరి వంశంలో మరో హీరో వెండితెరకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వారి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా తెలుగు పరిశ్రమలోకి ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఇస్తాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అతని మొదటి సినిమాపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక అతని లుక్కు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. మీడియా ముందు ఎక్కువగా కనిపించని మోక్షజ్ఞ ఇటీవల బాహ్య ప్రపంచంలోకి రావడంతో అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా ఒక లుక్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎప్పటినుంచో అదే మాట

ఎప్పటినుంచో అదే మాట

నందమూరి వంశంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదుపరి వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా తప్పకుండా ఎంట్రీ ఇస్తాడు అని ఎప్పుడు నుంచో చెబుతున్నారు. రెండేళ్ల క్రితం బాలయ్య తప్పకుండా మోక్షజ్ఞ ఎంట్రీ తన దర్శకత్వంలో ఉంటుంది అని కూడా అన్నారు. అంతేకాకుండా బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది.

 రిస్కు తీసుకోకూడదని..

రిస్కు తీసుకోకూడదని..


ఒక విధంగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ విషయంలో బాలయ్య బాబు ఏమాత్రం రిస్కు తీసుకోకూడదు అని అనుకుంటున్నాడు. ఫర్ఫెక్ట్ పవర్ఫుల్ కథ దొరికే వరకు కూడా అతని మొదటి సినిమాను అనౌన్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు. ఇదివరకే చాలా మంది రచయితలు దర్శకులతో కూడా ఆయన చర్చించడం జరిగింది. కానీ సరైన స్క్రిప్ట్ అయితే సెట్ అవ్వలేదని తెలుస్తోంది.

 లుక్ విషయంలో..

లుక్ విషయంలో..

ఇక నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఎన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా అతని లుక్ విషయంలో కూడా ఆమధ్య చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే మోక్షజ్ఞ హీరో తరహాలో కాకుండా కాస్త చబ్బీగా కనిపించడంతో అతను ఇంకా సిద్ధం కాలేదు అని టాక్ అయితే వినిపించింది. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్న మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించాడు.

 స్టైలిష్ లుక్ వైరల్

స్టైలిష్ లుక్ వైరల్

ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ తేజకు సంబంధించిన మరొక న్యూ లుక్ వైరల్ గా మారింది. అయితే గతంలో చూసినట్లుగా కాకుండా అతను ఇప్పుడు బరువు తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. కాస్త స్టైలిష్ లుక్ కూడా మెయింటైన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల బాలయ్య బాబుతో కలిసి మోక్షజ్ఞ హిట్ 2 సినిమాను వీక్షించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ మోక్షజ్ఞ కనిపించడంతో అతన్ని కొందరు ఫోటో తీసేందుకు ప్రయత్నం చేశారు.

ఎంతవరకు వచ్చింది?

ఎంతవరకు వచ్చింది?

ప్రస్తుతం మోక్షజ్ఞ తేజకు సంబంధించిన సరికొత్త లుక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ లుక్ లో అతను బాగానే ఉన్నాడు అని మొత్తానికి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కూడా టాక్ అయితే వినిపిస్తోంది. బాలయ్య బాబు ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999ను తెరపైకి తీసుకురావచ్చు అని కూడా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఎంతవరకు వచ్చింది అనే విషయంలో కూడా ఆ తర్వాత క్లారిటీ ఇవ్వలేదు. మరి మోక్షజ్ఞతేజ తన మొదటి సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X