twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nani Next Movie కు గ్రీన్ సిగ్నల్.. ఈసారి పవర్ స్టార్ దర్శకుడితో?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవుతున్న విషయం తెలిసిందే. దర్శకులు చాలా వరకు విభిన్నమైన కథలతో స్టార్ హీరోలను టచ్ చేస్తున్నారు. కుదిరితే హై బడ్జెట్ మూవీ వీలైతే పాన్ ఇండియా అనేస్తున్నారు. ఇక త్వరలోనే నాని మరోసారి టాలెంటెడ్ దర్శకుడితో వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసిన నాని కరోనా ప్రభావం తగ్గితే వెంటనే ఆ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో సాయి పల్లవి ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది.

    Nani another movie with pawan kalyan director

    ఇక ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాని శ్యామ్ సింగరాయ్ అనంతరం 'అంటే సుందరానికి' అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఇక ఇప్పుడు వేణు శ్రీరామ్ తో మరోసారి వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదివరకే ఈ కాంబినేషన్ లో MCA మూవీ వచ్చింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో మరోసారి కలిసి వర్క్ చేయాలని నాని కూడా అనుకున్నాడు. ఇక ప్రస్తుతం వేరే హీరోలు కూడా ఖాళీగా లేరని వేణు శ్రీరామ్, నానిపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఈసారి ఈ కాంబో ఏ రేంజ్ లో హిట్టు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Tollywood Natural star Nani creates good entertainment with her role in any movie. No matter how routine the story is, he takes the audience to the theaters with as much acting as possible. Nani's career has received a lot of comments that there are no big experiments except for the commercial routine movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X