Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Nani: మరోసారి పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నేచురల్ స్టార్.. అంతకుమించి అనేలా..?
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవల కాలంలో చాలా డిఫరెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ కథలకు చెక్ పెట్టిన ఈ స్టార్ హీరో టాక్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటున్నాడు. అంతే కాకుండా తన రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచుకుంటున్నాడు. గత ఏడాది వరుసగా రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలైన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన V సినిమాతో పాటు శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన టక్ జగదీష్ కూడా రెండు ఆమెజాన్ ప్రైమ్ లోనే విడుదల అయ్యాయి. అంతే కాకుండా ఆ రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ అయితే గట్టిగానే వచ్చింది.
ఇక మరో సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయనివ్వకుండా చూసుకోవాలని నాని ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా రావడంతో నాని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. నాని నెక్స్ట్ సినిమా 'అంటే.. సుందరానికి' కూడా డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో రానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని నాని నమ్మకంతో ఉన్నాడు.

ఇక నాని ఆ తరువాత చేయబోయే సినిమాలో అయితే కౄరంగా కనిపించనున్నాడట. అంటే పూర్తి స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే నాని జెంటిల్ మెన్, V సినిమాలలో విలన్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఆ సినిమాల్లో ఆ పాత్రలు అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక దసరా సినిమాలో మాత్రం నాని పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కాస్త బయపెడతాడాని తెలుస్తోంది. తెలంగాణ యాసలో నాని మోదటిసారి ఒక ఊర మాస్ పాత్రల్లో కనిపించనున్నాడట. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది.
తప్పకుండా నాని సరికొత్త పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ పై కూడా అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి. సినిమా కథ ఒక మారుమూల తెలంగాణ గ్రామ నేపథ్యంలో సాగే రివెంజ్ క్రైమ్ డ్రామా అని టాక్ వస్తోంది. తప్పకుండా సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అనేలా ఉంటుందట. ఇక నాని ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్ లపై కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే మరో కొత్త దర్శకుడితో కూడా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలతో నాని ఏ స్థాయిలో మార్కెట్ ను పెంచుకుంటాడో చూడాలి.