Ante sundaraniki: Nani మరో సర్‌ప్రైజ్ రెడీ.. న్యూ ఇయర్ కు సరికొత్తగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో నాని ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విభిన్నమైన పిరియాడిక్ ప్రేమ కథగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తనదైన శైలిలో సినిమాను తెరపై అందంగా చూపించాడు. ఇక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించగా హీరోగా నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్రలో చాలా కొత్తగా కనిపించాడు అని ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సినిమాతో నాని తన బాక్సాఫీస్ మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమా నాని సినిమా కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి కూడా విడుదల చేశారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా సక్సెస్ కావడంతో నాని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇదే తరహాలో మరి కొన్ని సినిమాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఒక కామెడీ సెంటిమెంట్ సినిమా పైన ఫోకస్ చేశాడు.

'అంటే సుందరానికి' అనే సినిమాతో నాని త్వరలోనే సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో నానిది ఒక డిఫరెంట్ టైమింగ్ ఉన్నా కామెడీ పాత్ర అని తెలుస్తోంది. తప్పకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ను కూడా ఇటీవల అనౌన్స్ చేశారు. నాని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ప్రేక్షకులు ముందుకు సరికొత్తగా తీసుకురాబోతున్నారు.
నాని 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేశారు. ఇక జనవరి 1 నుంచి సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ ను అందిస్తారని తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా సుందర ప్రసాద్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు ప్రత్యేకమైన పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. ఇక ఆ పోస్టర్లలో నాని ఎలా ఎంత కొత్తగా కనిపిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి నాని ఈ కామెడీ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక నాని లిస్టులో ఉన్న మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











