నాని గ్యాంగ్ లీడరా? చిరంజీవి టైటిల్ పెట్టుకొని.. చెడగొట్టొద్దని రచ్చ రచ్చ!
సినీ పరిశ్రమలో గతంలో ప్రజాదరణ పొందిన చిత్రాల టైటిల్స్‌ను వాడుకోవడం సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను నాని తన సినిమాకు పెట్టుకోవడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. యూట్యూబ్‌లో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఆదివారం (ఫిబ్రవరి 24వ తేదీ) నాని జన్మదినోత్సవం సందర్భంగా నేచురల్ స్టార్‌తో రూపొందించే తమ చిత్రానికి గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను ఖారారు చేశామని ఓ టీజర్‌ను రిలీజ్ చేసి వెల్లడించింది. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ అనగానే సినీ వర్గాల్లో ఒకింత ఆశ్చర్యం.. మరో వైపు కొంత అనుమానం కలిగింది. కానీ టీజర్ చూసిన తర్వాత టైటిల్ కరెక్టే అనే ఫీలింగ్ కలిగింది.. టీజర్లో ఏమున్నదంటే..
ఇంట్రెస్టింగ్‌గా టీజర్ కట్
పోలీస్ స్టేషన్‌లో కమెడియన్ సత్య ఇంటారాగేషన్‌తో టీజర్ మొదలవుతుంది. ఎంతమంది ఉన్నారని ఆఫీసర్ గద్దించే సరికి.. సత్య ఇలా చెప్పడం మొదలుపెడుతాడు.. ఒక చిన్నపాప కూతురు వయసు.. 8 ఏళ్లు ఉంటాయి. మరో అమ్మాయి చెలెల్లి వయసు 17 ఏళ్లు ఉంటాయి. మూడో అమ్మాయి కత్తిలా ఉంటుంది.. వయసు 22 ఏళ్లు. నాలుగో అమ్మాయి అమ్మ వయసు.. మంచి మనసు.. 50 ఏళ్లు ఉంటాయి. ఐదో అమ్మాయి బామ్మ వయసు..80 ఏళ్లు ఉంటాయి.

ఐదుగురికి ఓ గ్యాంగ్ లీడర్
ఐదుగురు మహిళల వెనుక ఒకడు ఉన్నాడు. ఐదు వేళ్లకు సపోర్ట్ ఇచ్చే అరచేతి మాదిరిగా. పంచపాండవుల వెనుక శ్రీకృష్ణుడిలా ఓ గ్యాంగ్ లీడర్ ఉన్నాడు అంటూ సత్య పూర్తి చేయడంతో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే 7,156,353 వ్యూస్ సాధించింది. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ నానికి కరెక్టేనా అనే వాదన అప్పుడే మొదలైంది.

గ్యాంగ్ లీడర్ టైటిల్‌పై..
కానీ య్యూట్యూబ్‌లో నానికి సపోర్ట్‌గా రకరకాల కామెంట్లు వినిపించాయి. 'హ్యాపీ బర్త్ డే నాని అన్న.. మా బాస్ టైటిల్ పెట్టారు.. ఆల్ ది బెస్ట్' అని, తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ ఒక బెస్ట్ మూవీ. ఆ టైటిల్‌ను చెడగొట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి అని కొందరు నెటిజన్లు కామెంట్లు విసిరారు.

బాస్ టైటిల్ బ్లాక్ బస్టర్ కావాలి
‘మా బాస్ టైటిల్ పెట్టారు.. బ్లాక్‌బస్టర్ కావాలి', ‘అప్పటి ఆ గ్యాంగ్ లీడర్ మెగా 🌟 చిరు అయితే ఇప్పటి ఈ గ్యాంగ్ లీడర్ నాచురల్ 🌟 నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభ అమోఘం', నాని, విక్రమ్ కుమార్, అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా మంచి విజయం సాధించాలి అంటూ కామెంట్లు విసిరారు.

బాస్ బర్త్ డేన రిలీజ్ చేయండి
మైత్రీ మూవీస్ రూపొందించే గ్యాంగ్ లీడర్ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానున్నది. ఈ చిత్రం సంగీతం అనిరుధ్ రవిచందర్, దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాతలు వై నవీన్, వై రవి, మోహన్ చెరుకూరి. అయితే ఈ సినిమాను ఆగస్టు 22న బాస్ పుట్టిన రోజున రిలీజ్ చేయాలనే అభిప్రాయం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











