రూ.2500తో కెరీర్ స్టార్ట్... నేచురల్ స్టార్ నానికి ఒక్కో సినిమాకు ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరిగా సాగుతున్నారు. అష్టా-చమ్మా సినిమాతో అలరించినా ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాలు వరుసగా చేసి మంచి నటుడిగా పేరు తెచుకున్నారు. ఈ క్రమంలోనే తన కామెటీ టైమింగ్‌తో నవ్వించి, భగ్నప్రేమికుడిలా మనసును హత్తుకుని, బాధ్యతగల తండ్రిలా కంటతడి పెట్టించారు. అసలు చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు రూ.100కోట్లు కలెక్షన్లను అందుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. మరి ఆయన అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా? దాని గురించే ఈ కథనం...
బ్యాగ్రౌండ్ లేకుండా
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోల్లో నాని ఒకరు. ఫ్యామిలీ అడియెన్స్, యూత్‌లో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో రాధాగోపాలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అలా తొలినాళ్లలో బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రేడియో జాకీ(RJ)గానూ పని చేశారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రకటనల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
ఈ క్రమంలోనే తన పనితీరుతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిని ఆకర్షించారు. అలా 2008లో విడుదలైన అష్టా-చమ్మాతో హీరోగా మారారు. ఈ చిత్రంలో తన నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టారు. ఆ తర్వాత తన సహజ నటనతో పక్కింటి కుర్రాడిలా అభిమానుల ప్రేమ, అప్యాయతలను పొందారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. భలే భలే మగాడివోయ్ ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయారు.
తొలి పారితోషికం 2500 రూపాయలు
ఇక నాని నటించిన జెర్సీ అయితే ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో నాని నటన మరో లెవల్ అనే చెప్పాలి కంటతడి పెట్టించారు. ఇక దసరాతో రూట్ మార్చి యాక్షన్ బాట పట్టిన ఆయన ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించారు. ఇక రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమారు రూ.10 కోట్లు నుంచి రూ.20కోట్లు వరకు తీసుకునే రేంజ్‌కు వెళ్లారని తెలిసింది. మరి ఆయన తొలి పారితోషికం ఎంతో తెలుసా? ఈ విషయాన్ని ఆ మధ్య నానినే స్వయంగా చెప్పారు. 2500 రూపాయలు తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే అది చెక్ రూపంలో అందుకున్నారట. కానీ ఆ చెక్ బౌన్స్ అయిందట. మరి అది అసిస్టెంట్ డెరెక్టర్‌గా ఉన్నప్పుడు తీసుకున్నారో లేదా అష్టా చమ్మా సినిమాకు తీసుకున్నారో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. నేడు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











